వెంకీ సినిమాలో నాని, మరోవైపు వెంకీతో పోటీ!

ఇదో విచిత్ర పరిస్థితి. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు నాని. ఇప్పుడు అదే సినిమాకు పోటీగా తన సినిమాను కూడా దించుకున్నాడు. తాజాగా ఈ మేటర్ బయటకొచ్చింది. Advertisement శౌర్యవ్ అనే కొత్త…

ఇదో విచిత్ర పరిస్థితి. ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తున్నాడు నాని. ఇప్పుడు అదే సినిమాకు పోటీగా తన సినిమాను కూడా దించుకున్నాడు. తాజాగా ఈ మేటర్ బయటకొచ్చింది.

శౌర్యవ్ అనే కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు నాని. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించాడు. అంతకంటే ముందే, క్రిస్మస్ బరిలో వెంకటేష్ హీరోగా నటిస్తున్న సైంధవ్ సినిమాను ఎనౌన్స్ చేశారు.

ఇలా క్రిస్మస్ కు వెంకీ-నాని పోటీపడుతున్నారనే విషయాన్ని ఇదివరకే చెప్పుకున్నాం. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. వెంకటేష్ సినిమాలో నాని కూడా నటిస్తున్నాడట.

శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకీ చేస్తున్న సైంధవ్ సినిమాలో నాని ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని పరోక్షంగా వెల్లడించాడు నాని. క్రిస్మస్ కు రెండు సినిమాలు నావే అంటూ పోస్ట్ పెట్టగా, అవును, రెండూ హిట్టు సినిమాలే అంటూ శైలేష్ కొలను కూడా స్పందించాడు.

దీంతో వెంకీ సినిమాలో నాని ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడనే విషయం స్పష్టమైంది. అదే సమయంలో వెంకీ సినిమాకు పోటీగా నాని సినిమా (ఇంకా పేరు పెట్టలేదు) కూడా వస్తోంది. అదే గమ్మత్తు.

దసరా సినిమా ప్రచారం టైమ్ లో కూడా నాని దాదాపు ఇదే పద్ధతి ఫాలో అయ్యాడు. దసరా వచ్చిన వారం రోజుల తర్వాత రవితేజ రావణాసుర సినిమా వచ్చింది. దీంతో తన సినిమా ప్రచారం కోసం రవితేజను అహ్వానించాడు. పనిలోపనిగా రవితేజ సినిమాకు తను కూడా ప్రచారం చేసి పెట్టాడు. చూస్తుంటే.. క్రిస్మస్ కు నాని-వెంకీ మధ్య ఈ సీన్ రిపీట్ అయ్యేలా ఉంది.