ఈ నెల చివరిలో విడుదల కాబోతోంది సరిపోదా శనివారం సినిమా. డివివి దానయ్య నిర్మాత.. వివేక్ అత్రేయ దర్శకుడు. నాని హీరోగా నటించిన ఈ సినిమా బిజినెస్ దాదాపు 106 కోట్లకు పైగా జరిగినట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు హీరో నాని చేసిన సినిమాలు అన్నింటిలో భారీ బిజినెస్, భారీ నిర్మాణ వ్యయం ఈ సినిమాదే. ఓ పద్దతి ప్రకారం సబ్జెక్ట్ లు ఎంచుకుంటూ తన బిజినెస్ ను పెంచుకుంటూ వస్తున్నారు హీరో నాని. దాని వల్ల ఓ నమ్మకం ఏర్పడింది ఓటిటి సంస్థలకు. అందువల్ల నాని సినిమాలకు ఇట్టే నాన్ థియేటర్ బిజినెస్ జరిగిపోతోంది.
సరిపోదా శనివారం సినిమాకు 71 కోట్లకు పైగా నాన్ థియేటర్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ 71 కోట్లలో ఒక్క అడియో రైట్స్ నే ఏడు కోట్లు అని తెలుస్తోంది. 25 కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను విక్రయించేసారు. ఇక కర్ణాటక రెండున్నర కోట్లు. ఓవర్ సీస్ 7 కోట్లు ఇలా బిజినెస్ జరిగింది. మొత్తం అన్ని రకాల హక్కులు కలిసి 106 కోట్ల మేరకు జరిగినట్ల ట్రేడ్ వర్గాల బోగట్టా.
సినిమాకు నిర్మాణం వ్యయం కూడా కాస్త గట్టిగానే అయింది. 120 రోజుల మేరకు ప్రొడక్షన్ జరగడంతో సుమారు అన్నీ కలిపి 95 కోట్ల మేరకు వ్యయం జరిగినట్లు తెలుస్తోంది. అంటే నిర్మాత దానయ్య కు 11 కోట్ల మేరకు లాభం అనుకోవాల్సి వుంటుంది.
ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ తో తయారైంది సరిపోదా శనివారం సినిమా. ఎస్ జె సూర్య విలన్ గా నటించారు.
Vc available 9380537747
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు
అయినా థియేటర్లో చూడం
they increase budget& audience bear it…wow super strategy….🤣🤣🤣