కీలకమైన డీల్ క్లోజ్ చేసిన నాని సినిమా

నాని తన పారితోషికాన్ని ఎప్పటికప్పుడు పెంచడానికి ప్రధాన కారణం, అతడికున్న నాన్-థియేట్రికల్ మార్కెట్. ఈ సెగ్మెంట్ లో నాని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మరీ ముఖ్యంగా నాని సినిమా దక్కించుకుంటే రేటింగ్ గ్యారెంటీ…

నాని తన పారితోషికాన్ని ఎప్పటికప్పుడు పెంచడానికి ప్రధాన కారణం, అతడికున్న నాన్-థియేట్రికల్ మార్కెట్. ఈ సెగ్మెంట్ లో నాని చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మరీ ముఖ్యంగా నాని సినిమా దక్కించుకుంటే రేటింగ్ గ్యారెంటీ అనే నమ్మకం టీవీ ఛానెల్స్ లో ఉంది. ఈ నమ్మకమే, హాయ్ నాన్న సినిమాకు భారీ రేటు దక్కేలా చేసింది.

రీసెంట్ గా హాయ్ నాన్న శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది. జెమినీ ఛానెల్ ఈ సినిమా హక్కుల్ని దక్కించుకుంది. ఈ డీల్ లాక్ అయిన తర్వాతే యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది.

నాని నటించిన సినిమాల శాటిలైట్ రైట్స్ అన్నింటినీ వరుసగా సన్ నెట్ వర్క్ దక్కించుకుంటోంది. ఇంతకుముందు ఈ హీరో నటించిన 3 సినిమాలు జెమినీ దగ్గరే ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా సినిమాల రైట్స్ దక్కించుకున్న ఈ కంపెనీ, ఇప్పుడు హాయ్ నాన్న శాటిలైట్ రైట్స్ కూడా కొనుగోలు చేసింది.

హాయ్ నాన్న సినిమా కోసం నాని, తన కెరీర్ లోనే హయ్యస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్నాడనే టాక్ ఉంది. దీంతో మూవీ బడ్జెట్ కూడా భారీగా పెరిగింది. అయినప్పటికీ నాన్-థియేట్రికల్ తో ఈ సినిమా గట్టెక్కేలా కనిపిస్తోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అవుతోంది.