Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఆ అందాల తార‌కు ఇది ఎన్నో పెళ్లో?

ఆ అందాల తార‌కు ఇది ఎన్నో పెళ్లో?

అందాల తార న‌య‌న‌తార న‌ట‌న కంటే ఆమె వ్య‌క్తిగ‌త జీవితంపైనే ఎక్కువ చ‌ర్చ జ‌రిగింది, జ‌రుగుతోంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆమె అడుగు పెట్టిన‌ప్ప‌టి నుంచి ప‌లువురితో డేటింగ్‌పై అనేక ఊహాగానాలు వినిపించాయి. గ‌తంలో తాను ఇద్ద‌రితో ప్రేమ‌లో ఉన్న‌ది నిజ‌మేన‌ని న‌య‌న‌తార అనేక సార్లు ఒప్పుకున్నారు. గ‌తంలో వాళ్ల‌తో పెళ్లి విష‌య‌మై అనేక డేట్లు, ముహూర్తాల‌ను నెటిజ‌న్లు, అభిమానులు పెట్టిన విష‌యం తెలిసిందే. కానీ అవేవీ నిజం కాలేదు.

దాదాపు నాలుగేళ్లుగా విఘ్నేష్ శివ‌న్‌తో న‌య‌న‌తార పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగారు. ఈ నాలుగేళ్ల‌లో వాళ్లిద్ద‌రి వివాహానికి సంబంధించి అనేక ముహూర్తాలు ఖ‌రారు కావ‌డం , చివ‌రికి ఎత్తిపోవ‌డం తెలిసిందే. చివ‌రికి పెళ్లి చేసుకునే జంటే ఆశ్చ‌ర్య‌పోయేలా నెటిజ‌న్లు శుభ‌లగ్నం పెట్ట‌డం విశేషం. అంతెందుకు నెల‌క్రితం ముంబ‌య్‌లో విఘ్నేష్‌- న‌య‌న‌తార జంట కేవ‌లం కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వివాహ బంధంతో ఒక్క‌ట‌య్యార‌ని, అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

కానీ అందులో నిజం లేద‌ని న‌య‌న‌తార ప్ర‌క‌టించారు. త‌న పెళ్లి విష‌యాన్ని మీడియాకు త‌ప్ప‌కుండా చెప్పే చేసుకుంటాన‌ని కూడా ఆమె స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ న‌య‌న‌తార పెళ్లి వార్త‌లు ప‌దేప‌దే సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. తాజాగా న‌య‌న‌తార పెళ్లి వార్త‌లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నెల 8వ తేదీ త‌ర్వాత ఆల‌యాలు తెరుచుకోనున్న నేప‌థ్యంలో త‌మిళ‌నాడులోని ఓ ప్ర‌ముఖ ఆల‌యంలో న‌య‌న‌తార -విఘ్నేష్ జంట పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం ఖ‌రారు చేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.  కేవలం కొంతమంది అతిథుల స‌మ‌క్షంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.  అయితే వివాహ వార్తలపై  ఈ జంట  ఎలాంటి ప్రకటన చేయ‌లేదు. మొత్తానికి నెటిజ‌న్లు న‌య‌న‌తార‌కు నెటిజ‌న్లు చేస్తున్న ఎన్నో పెళ్లో మ‌రి?

వెళ్ళేది ఎవరు? పిలిచేది ఎవరు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?