ఇప్పట్లో పెళ్లి చేసుకోనంటున్న ముదురు హీరో

జనాలు పెద్దగా ఫోకస్ పెట్టరు కానీ, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో నవదీప్ కూడా ఉన్నాడు. ఈ నటుడు ఎప్పుడో 30 క్రాస్ చేశాడు. ఇంకా చెప్పాలంటే, 40ల వైపు పరుగులు…

జనాలు పెద్దగా ఫోకస్ పెట్టరు కానీ, టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ లో నవదీప్ కూడా ఉన్నాడు. ఈ నటుడు ఎప్పుడో 30 క్రాస్ చేశాడు. ఇంకా చెప్పాలంటే, 40ల వైపు పరుగులు పెడుతున్నాడు. మరి ఈ నటుడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు?

“పెళ్లి జరిగే టైమ్ లో అదే జరుగుతుంది. నేను ప్రస్తుతానికి రెడీగా లేను. నేను రెడీ అయినప్పుడు చేసుకుంటాను. చేసుకోబోయే అమ్మాయిలో క్వాలిటీస్ గురించి నేను చెప్పలేను, ఎందుకంటే ముందు నేనే రెడీగా లేను. నా లోపలున్నోడికి ఏం కావాలో ఇంకా తెలియడం లేదు. నేనేంటో ముందు నాకు తెలిస్తే కదా, మరొకర్ని తెచ్చి చంకలో పెట్టుకోవడానికి. వయసు అయిందని, ఎవరో అడిగారని పెళ్లిళ్లు చేసుకోకూడదు.”

ఇలా తను పెళ్లికి సిద్ధంగా లేనని ప్రకటించాడు నవదీప్. ఈ సందర్భంగా వైవాహిక వ్యవస్థపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వివాహ వ్యవస్థలో లోపం లేదని, దాన్ని అర్థం చేసుకోవడంలోనే లోపాలున్నాయని అంటున్నాడు.

“వివాహ వ్యవస్థ మంచిదే. కాకపోతే దాన్ని అర్థం చేసుకోవడంలో చాలామంది తప్పులు చేస్తున్నారు. ఇప్పుడు కాలం మారింది. పెళ్లి ఎందుకు చేసుకుంటున్నామనే అంశంపై యూత్ కు ఓ క్లారిటీ ఉండాలి. అప్పుడే పెళ్లి చేసుకోవాలి. వైవాహిక వ్యవస్థలో లోపం లేదు. కాకపోతే నా పరిస్థితి వేరే.”

నవదీప్ పై ఇప్పటికే చాలా డేటింగ్ రూమర్స్ వచ్చాయి. మరోవైపు డ్రగ్స్ కేసు కూడా అతడ్ని వెంటాడుతోంది. ఇంకోవైపు చేతిలో సినిమాలు కూడా ఉన్నాయి. బహుశా అందుకేనేమో ప్రస్తుతానికి పెళ్లిపై ఆలోచన చేయడం లేదు నవదీప్.