Advertisement

Advertisement


Home > Movies - Movie News

నవీన్ పోలిశెట్టికి గాయాలు!

నవీన్ పోలిశెట్టికి గాయాలు!

జాతిరత్నాలు, మిస్టర్ శెట్టి తరువాత సరైన స్క్రిప్ట్ తయారీలో బిజీగా వున్నారు హీరో నవీన్ పోలిశెట్టి. సితార సంస్థలో ఓ సినిమా, షైన్ స్క్రీన్స్ లో మరో సినిమా చేయాల్సివుంది. ప్రస్తుతం నవీన్ అమెరికాలో వున్నారు. అయితే ఒకటి రెండు రోజుల క్రితం నవీన్ కు చిన్న ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బైక్ స్కిడ్ కావడంతో కింద పడినట్లు, చేతికి ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు నవీన్ ఇక్కడి తన టీమ్ కు మెసేజ్ అందించినట్లు తెలుస్తోంది.

చేతికి బలమైన గాయం తగలడం వల్ల మానడానికి కొన్ని నెలలు పడుతుందని తెలుస్తోంది. దాని వల్ల నవీన్ మళ్లీ సెట్ మీదకు రావడానికి కొన్ని నెలలు పడుతుందని తెలుస్తోంది. అయితే నవీన్ కు గాయం అన్న విషయం ఇండస్ట్రీలో ఎవరికీ తెలియలేదు. నవీన్ నే ఆయనకు సంబంధించిన ఓ టీమ్ కు మెసేజ్ పెట్టడంతో ఇది బయటకు వచ్చింది.

అమెరికాలో వుంటున్న నవీన్ తన తరువాత సినిమాను సితార సంస్థలో చేయాల్సి వుంది. కథ నచ్చినా డైరక్టర్ నచ్చలేదని వార్తలు వచ్చాయి. దాంతో వేరే కథ, వేరే దర్శకుడు అని చూస్తున్నారు. ప్రస్తుతం కథ రెడీ అవుతోందని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?