cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

నయనతారతో నితిన్ బేరాలు

నయనతారతో నితిన్ బేరాలు

అంథాదూన్ సినిమా రీమేక్ హక్కులు కొని దగ్గర పెట్టుకున్నాడు హీరో నితిన్. డైరైక్టర్ కూడా ఫిక్స్ అయ్యాడు. మేర్లపాక గాంధీ. స్క్రిప్ట్ రెడీ అయింది. కానీ సినిమాలో కీలకమైన టబు పాత్రను తెలుగులో ఎవరి చేత చేయించాలా?అన్నదే తేలడం లేదు. ఇలియానాను అడిగారు. ఆమె తెలుగులో మళ్లీ చేయడం అంటూ వుంటే హీరోయిన్ గా తప్ప, మరోలా చేయను అని క్లారిటీ ఇచ్చేసింది.

అప్పటి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తూనే వున్నాయి. కానీ ఏదీ ఫైనల్ కాలేదు. లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఈ కీలకమైన పాత్ర కోసం నయనతారను సంప్రదించారని. సరైన పాత్ర దొరికితే ఎలాంటిదైనా చేయడానికి నయనతార రెడీ. కానీ రెమ్యూనిరేషన్ నే సమస్య. 

ఆమె సినిమా, హీరో, క్యారెక్టర్ ఇవన్నీ లెక్కలు వేసి రెమ్యూనిరేషన్ అడుగుతుంది. పెద్ద సినిమా, పెద్ద హీరో, జస్ట్ డ్యాన్సింగ్ డాల్ అంటే రెండు కోట్లకే రెడీ. అదే హీరోయిన్ ఓరియెంటెడ్ అంటే నాలుగు కోట్లు డిమాండ్ చేస్తుంది.

ఇప్పుడు అంధాదూన్ రీమేక్ కు నయనతార కాస్త భారీగా కోట్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో బేరాలు మొదలయ్యాయి. నిజానికి నయనతార అయితే సినిమాకు బజ్ వేరుగా వుంటుంది. క్యారెక్టర్ కూడా ఆ రేంజ్ లో పండుతుంది. అందువల్ల అవసరం అయితే అడిగినంతా ఇవ్వాల్సిందే.

హాస్పిటల్ లో చేరిన నటుడు పృధ్వీరాజ్

టైమ్ బాలేకపోతే ఒక్కోసారి అంతే

 


×