కాలం అనేక మార్పులు తీసుకొస్తుంది. కాల మహిమ అదే. కాలం కలిసిరానప్పుడు, దాంతో పాటే ఎవరైనా ప్రయాణించాల్సిందే. లేకపోతే వెనుకపడి పోతారు. కాదు, కూడదంటే కనుమరుగై పోతారు. ఈ లౌక్యం తెలుసుకుంటే పది కాలాల పాటు మనుగడ సాగిస్తారు. తమ ఉనికిని కాపాడుకోగలుగుతారు.
స్టార్ హీరోయిన్ నయనతారలో కూడా కాలం మార్పు తీసుకొచ్చింది. అందాల ఆరబోతకు రెడ్డీ అంటోంది. ఇన్నాళ్లు వేటికైతే ‘నో’ అని చెబుతూ వచ్చిందో, ఇప్పుడు మాత్రం ‘ఎస్’ అంటోంది. చిట్టిపొట్టి డ్రెస్సులకు, బికినీలకు, ముద్దు సీన్లకు ఆమె ఓకే అంటోంది. ఇంతకాలం ఇవి అంటరానివిగా చూస్తూ…అలాంటి కథలు వినడానికి ఆసక్తి కనబరిచేది కాదు. ఇప్పుడు మాత్రం తనకు ఎలాంటి అభ్యంతరం లేదని పచ్చ జెండా ఊపుతోంది.
అసలు అందాల తార…నయనతార. ఇక అందాలను ఆరబోసేందుకు సిద్ధమంటే దర్శకనిర్మాతల గురించి చెప్పేదేముంది. పండగే పండగ అంటున్నారు. నయనతారలో వచ్చిన ఈ మార్పుతో సగం సినిమా విజయం సాధించినట్టే అని వారు అంటున్నారు.
ఇటీవల ఆమెకు సినిమాలు లేకపోవడం వల్లే తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, చిత్ర పరిశ్రమలోకి కొత్త హీరోయిన్ల రాక పెరగడం, తమ అందచందాల ప్రదర్శనకు వాళ్లు వెనుకాడకపోవడం, అలాంటి వాళ్లతో పోటీ పడాల్సి రావడంతో నయన తన నిర్ణయాన్ని మార్చుకున్నట్టుగా చెబుతున్నారు.