క్రేజ్‌కి తగ్గట్టు క్యాష్ డిమాండ్ చేసినపుడు, ట్రెండ్‌కి తగ్గట్టు అప్‌డేట్ కూడా అవుతుండాలి. నయనతారకి మొదట్నుంచీ ప్రమోషన్స్ పట్ల ఆసక్తి లేదు. ఎలాంటి సినిమా చేసినా కానీ ప్రమోషన్స్‌కి దూరంగా వుంటుంది.
అయితే ఒకప్పుడు ప్రచార వ్యవహారాలకు ఇప్పుడున్నంత ప్రాధాన్యత లేదు. అగ్ర హీరోల చిత్రాలకి ప్రచారం చేసినా చేయకపోయినా నడిచిపోయేవి. కానీ ఇప్పుడు ఏ సినిమాకి అయినా పబ్లిసిటీ కీలకం.
అయితే నయనతార మాత్రం తనకి ఎంత పారితోషికం ఇచ్చినా కానీ ఈ క్లాజ్ తీయడానికి అంగీకరించడం లేదు. దీంతో ఆమెని కన్సిడర్ చేస్తోన్న చిత్రాలకి కూడా లాస్ట్ ఆప్షన్‌గా పెట్టుకుంటున్నారు. ఎవరూ దొరక్కపోతే అప్పుడే తనకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
పైగా నయనతార ఇటీవల చేసిన చిత్రాలకి ఆమె వల్ల వచ్చిందేమీ లేదు. తమిళ మార్కెట్ కలిసి వస్తుందని ఆమెని తీసుకుంటున్నారు కానీ ఆమె అక్కడ ప్రభావం చూపించడం లేదు.
ఇక నయనతార పద్ధతులు మార్చుకోని పక్షంలో ఇదివరకటిలా ఎక్కువ చిత్రాల్లో నటించే అవకాశం లేదు. బహుశా తన కెరీర్ ఎంతో కాలం ముందుకు సాగదని గ్రహించిన నయనతార ఆల్రెడీ లైఫ్‌లో సెటిల్ అయ్యే ప్లాన్స్ చేస్తున్నట్టుందని కూడా మాట్లాడుకుంటున్నారు.