లేడి సూపర్ స్టార్ నయనతార , డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ దంపతులు సరోగసీ ద్వారా కవల మగబిడ్డలకు తల్లిదండ్రులయ్యారు. ఈ ఏడాది జూన్ 9న పెళ్లి చేసుకున్న నయనతార, విఘ్నేష్ శివన్ సరోగసీ ద్వారా కవలలను జన్మనిచ్చనట్టు విఘ్నేష్ తన ట్వీట్టర్ లో ప్రకటించారు.
విఘ్నేష్ దంపతులు తన ట్వీట్టర్ లో పిల్లల ఫోటోలు షేరు చేస్తూ “నయన్ – నేను, అమ్మ – అప్పగా మారాము… మేము ట్విన్ బేబీ బాయ్స్ కు తల్లిదండ్రులు అయ్యమని, మా ప్రార్థనలు, పెద్దల ఆశీస్సులు ఫలించాయి. మీ అందరి బ్లెసింగ్స్ కావాలి’’ అని ఇద్దరు బిడ్డల పాదాలకు ముద్దు పెడుతున్న ఫోటోలను విఘ్నేష్ శివన్ షేర్ చేసారు.
2015లో వచ్చిన ‘నానుం రౌడ్ ధాన్’ సినిమా సెట్స్‌లో తొలిసారి కలుసుకున్న నయనతార, విఘ్నేశ్ శివన్.. కొంతకాలానికే ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు డేటింగ్ చేసిన ఇరువురు. ఈ ఏడాది జూన్ 9న పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. పెళ్లి జరిగి ఏడాది పూర్తికాక ముందే సరోగసీ ద్వారా వీరిద్దరూ తల్లిదండ్రులు కూడా అయిపోయారు. నయనతార అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.