షూటింగ్ ఆపేసి ఆడుకుంటున్న హీరోయిన్

హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె చేతిలో 2 తెలుగు సినిమాలున్నాయి. మరోవైపు తమిళ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పుడీ 3 సినిమాల్ని పక్కనపెట్టేసింది నిధి అగర్వాల్. ఎంచక్కా ఆడుకుంటోంది.…

హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె చేతిలో 2 తెలుగు సినిమాలున్నాయి. మరోవైపు తమిళ సినిమా షూటింగ్ కూడా నడుస్తోంది. ఇప్పుడీ 3 సినిమాల్ని పక్కనపెట్టేసింది నిధి అగర్వాల్. ఎంచక్కా ఆడుకుంటోంది. దీనికి కారణం దీపావళి.

దీపావళి వస్తే ఎంత బిజీగా ఉన్నప్పటికీ అన్ని పనులు పక్కనపెట్టేస్తానంటోంది నిధి అగర్వాల్. కొన్నేళ్లుగా ఇలానే చేస్తున్నానని, ఈ ఏడాది కూడా దీపావళి కోసం షూటింగ్స్ అన్నీ పక్కనపెట్టేశానని చెబుతోంది. దీపావళి రోజున బెంగళూరులోని తన ఇంట్లో అందరితో కలిసి ఆటలు ఆడుకోవడం తనకు ఇష్టం అంటోంది.

“ఈ దీపావళికి కూడా షూటింగ్ కు శెలవు పెట్టేశా. మంచి భోజనం చేస్తూ, కుటుంబ సభ్యులతో ఆడుకోవడం చాలా ఇష్టం. చాలా గేమ్స్ ప్లాన్ చేశాం. ఇక ఈ దీపావళికి స్పెషల్ ఏంటంటే.. నా కోసం అమ్మ ప్రత్యేకంగా ఓ డ్రెస్ రెడీ చేసింది. ఆ డ్రెస్ తోనే ఈ ఏడాది దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాను.”

దీపావళి రోజున ఇంట్లో పూజలు చేస్తారని, అయితే అలా పూజలో కూర్చోవడం కంటే.. ఇంటిని అలంకరించుకోవడం, గేమ్స్ ఆడడం, మంచి భోజనం చేయడం తనకు ఇష్టం అంటోంది నిధి అగర్వాల్. 

ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవన్ కల్యాణ్ సరసన హరిహర వీరమల్లు సినిమా చేస్తోంది. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ఆ సినిమాకు సంబంధించి చాలా వర్క్ పెండింగ్ ఉందంటోంది నిధి.