లవ్ చేయడం టైమ్ వేస్ట్ అంటున్న హీరోయిన్

ప్రేమ గురించి చెప్పమంటే హీరోయిన్లు రకరకాల కబుర్లు చెబుతారు. అదొక మధురమైన అనుభూతి అని, జీవితంలో స్వీట్ మెమొరీ అని అంటారు. ప్రేమ చాలా అవసరం అంటూ ఉపన్యాసాలు దంచుతారు. కానీ ఇక్కడో హీరోయిన్…

ప్రేమ గురించి చెప్పమంటే హీరోయిన్లు రకరకాల కబుర్లు చెబుతారు. అదొక మధురమైన అనుభూతి అని, జీవితంలో స్వీట్ మెమొరీ అని అంటారు. ప్రేమ చాలా అవసరం అంటూ ఉపన్యాసాలు దంచుతారు. కానీ ఇక్కడో హీరోయిన్ మాత్రం అదంతా ట్రాష్ అంటోంది. ఆమె పేరు నికీషా పటేల్.

పవన్ కల్యాణ్ సరసన కొమరం పులి సినిమాలో నటించిన ఈ భామ.. ప్రేమ-గీమ-జాంతానై అంటోంది. ప్రేమించడం అంటే అంతకంటే టైమ్ వేస్ట్ వ్యవహారం మరొకటి లేదని ఓపెన్ గా చెబుతోంది. కేవలం ప్రేమ మాత్రమే కాదు.. రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం కూడా టైమ్ వేస్ట్ అంటోంది.

“ప్రేమ, రిలేషన్ షిప్ లాంటివి టైమ్ వేస్ట్ వ్యవహారాలు. నా దృష్టిలో ప్రేమ అనేది నిలకడగా ఉండదు. ఇక నా విషయంలో ప్రేమ ఎక్కువ సేపు నిలిచేది కాదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లవ్ అనేది పెద్ద బోరింగ్ అనే విషయాన్ని నేను గట్టిగా చెప్పగలను.”

ఇలా ప్రేమపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది నికీషా పటేలా. ఎంత స్ట్రయిట్ గా ప్రశ్న అడిగితే అంత బోల్డ్ గా సమాధానం చెబుతానంటూ ఊరించిన ఈ చిన్నది.. ప్రేమపై ఇలా తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. నికీషా స్టేట్ మెంట్ చూస్తుంటే.. జీవితంలో ఆమెకు ప్రేమ దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.

మ‌హేష్ బాబుతో మాది విడ‌దీయ‌లేని అనుభంధం

కుప్పంలో టీడీపీ 14 స్థానాల‌కే ప‌రిమిత‌మైంది