నిఖిల్ తో సంయుక్త

టాలీవుడ్ లో వరుస హిట్ లు కొట్టిన లక్కీ హీరోయిన్ ఈ మధ్యన ఎవరున్నారు అంటే వెంటనే వినవచ్చే పేరు సంయుక్త మీనన్. భీమ్లానాయక్ నుంచి సర్, విరూపాక్ష వరకు అన్నీ హిట్ లే. …

టాలీవుడ్ లో వరుస హిట్ లు కొట్టిన లక్కీ హీరోయిన్ ఈ మధ్యన ఎవరున్నారు అంటే వెంటనే వినవచ్చే పేరు సంయుక్త మీనన్. భీమ్లానాయక్ నుంచి సర్, విరూపాక్ష వరకు అన్నీ హిట్ లే. 

అయితే అలా అని చకచకా సినిమాలు చేయడం లేదు. శ్రీలీల మాదిరిగా క్రేజీ హీరోయిన్ అయిపోలేదు. స్లో అండ్ స్టడీగా చేసుకుంటూ వెళ్తోంది సంయుక్త. లేటెస్ట్ గా ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు సైన్ చేసింది.

టాగోర్ మధు-నిఖిల్ కాంబినేషన్ లో నిర్మించే భారీ పాన్ ఇండియా సినిమా ‘స్వయంభూ’ లో సంయుక్త హీరోయిన్ గా చేయబోతోంది. కార్తికేయ 2 తరువాత నిఖిల్ ఎక్కువగా ఆశలు పెట్టుకుంటున్న సినిమా ఇది. చాలా భారీ కథ, బడ్జెట్ తో తయారవుతోంది ఈ సినిమా. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ లోకి సంయుక్త ఎంటర్ అవుతోంది.

ఈ సినిమాను ఈ నెల 18న ప్రారంభిస్తున్నారు. 18న ముహుర్తం చేసి ఏకబిగిన షూట్ చేస్తారు. దీని తరువాత నిఖిల్ కార్తికేయ 3 సినిమా మీదకు వెళ్తారు.