ఇచ్చట వాహనములు నిలుపరాదు అనే చిత్రమైన టైటిల్ తో సినిమా చేస్తున్నాడు హీరో సుశాంత్. టైటిల్ విన్న దగ్గర నుంచి కచ్చితంగా వైవిధ్యమైన సబ్జెక్ట్ అయి వుంటుందనే అనుకున్నారంతా. ఇప్పుడు ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది.
లవ్, యాక్షన్ సినిమాకు కాస్త డిఫరెంట్ టచ్ ఇచ్చే ప్రయత్నం జరిగిందని క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఓ అబ్బాయి…అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అమ్మాయి అన్నదమ్ముడు విలనయ్యాడు.
ఇలా చెబితే రొటీన్ నే అనిపిస్తుంది. కానీ అమ్మాయి ది ఓ కాలనీ, ఆ కాలనీ మొత్తం డిఫరెంట్ ఆటిట్యూడ్ తో వుండడం, అందరూ కలిసి హీరోను కార్నర్ చేయడం అన్న పాయింట్లు యాడ్ కాగానే కాస్త డిఫరెంట్ టచ్ వచ్చింది. ట్రయిలర్ బాగానే వుందనిపించేలా కట్ చేసారు.
సుశాంత్ మరోసారి మాస్ టచ్ వున్న పాత్ర చేయాలని అనుకున్నట్లు వుంది. గతంలో కూడా ఇలాంటివి ట్రయ్ చేసాడు. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.మీనాక్షి చౌదరి కథానాయిక. ఈనెల 27న థియేటర్లలోకి వస్తోంది.