నితిన్ అడ్వంచరస్ సినిమా

హీరో నితిన్-సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ అంటే కచ్చితంగా ఫుల్ ఫన్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఎవరైనా. ఛలో, భీష్మ లాంటి సినిమాల ట్రాక్ రికార్డు అలాంటిది.  Advertisement మైత్రీ…

హీరో నితిన్-సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ అంటే కచ్చితంగా ఫుల్ ఫన్ మూవీ ఎక్స్ పెక్ట్ చేస్తారు ఎవరైనా. ఛలో, భీష్మ లాంటి సినిమాల ట్రాక్ రికార్డు అలాంటిది. 

మైత్రీ సంస్థ నితిన్-వెంకీల కాంబినేషన్ లో ఓ సినిమా స్టార్ట్ చేసింది. ఫర్ ఏ ఛేంజ్ ఈ సినిమా కేవలం ఫన్ మూవీ మాత్రమే కాదట. ఓ అడ్వంచరస్ జర్నీ సినిమాలో వుంటుందని తెలుస్తోంది. దాంతో పాటు వెంకీ స్టయిల్ ఫన్ కూడా వుంటుందట.

ప్రస్తుతం ఈ సినిమా షూట్ జరుగుతోంది. ఇటు అడ్వంచర్ అటు ఫన్ కలిపి సినిమా చేయడం కాస్త రేర్ గానే వుంటుంది. కానీ అలా వచ్చిన సినిమాలు అన్నీ హిట్ లే. అందువల్ల వెంకీ – నితిన్ ల సినిమా మీద హోప్ పెట్టుకోవచ్చు. నితిన్ ఈ సినిమా కాకుండా వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నారు. అది కొంత వరకు పూర్తయింది.

అయితే ఆ సినిమా స్క్రిప్ట్ సెకండాఫ్ విషయంలో ఇంకా కిందా మీదా అవుతున్నారు. రైటర్ హర్షవర్ధన్ వచ్చి సెకండాఫ్ ను సెట్ చేస్తున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అందుకే ఆ సినిమా షూట్ కు పాజ్ బటన్ నొక్కి వెంకీ కుడుముల సినిమాను స్టార్ట్ చేసారు నితిన్.