నితిన్ లవ్ ఎఫైర్ పై, అతడి తాజా హీరోయిన్ రష్మిక స్పందించింది. ఈ విషయంలో నితిన్ ను పెద్ద దొంగ అంటోంది రష్మిక. తన లవ్ మేటర్, నిశ్చితార్థం గురించి తనకు కూడా తెలియదంటోంది. కేవలం నిశ్చితార్థానికి 2 రోజుల ముందు మాత్రమే నితిన్, రష్మికకు తన మేటర్ మొత్తం చెప్పాడట.
“నిశ్చితార్థానికి 2 రోజుల ముందే నితిన్ లవ్ మేటర్ తెలిసింది. అప్పటివరకు నాకు చెప్పలేదు. ఆయన లవ్ మేటర్ చెప్పడం, ఆ వెంటనే భీష్మ ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. దీంతో ఓ ఇంటర్వ్యూలో నేనే ఆ విషయాన్ని బయటపెట్టాను. ఇక నితిన్ కూడా అప్పట్నుంచి తన పెళ్లి మేటర్ బయటకు చెప్పడం స్టార్ట్ చేశాడు.”
నితిన్ తో వర్క్ చేస్తుంటే.. ఓ కాలేజ్ ఫ్రెండ్ తో కలిసి పనిచేస్తున్న ఫీలింగ్ వచ్చిందంటోంది రష్మిక. చాలా కంఫర్ట్ గా ఉంటుందని, చాలా సీనియర్ అనే ఇగో నితిన్ లో అస్సలు కనిపించదని చెబుతోంది. ఇప్పటివరకు తను పనిచేసిన హీరోల్లో నితిన్ అంత సరదాగా సెట్స్ లో ఉంటే హీరోను చూడలేదంటోంది.
“నేను సరదాగా చెప్పడం లేదు. 'అ ఆ'లో నితిన్-సమంతను చూసినప్పుడు ఇలాంటి సినిమా చెయ్యాలి అనుకొన్నాను. వాళ్లిద్దరూ అంత చక్కగా అనిపించారు ఆ సినిమాలో. ఇప్పుడు నితిన్ తోటే ఈ సినిమా చేశా. మొదటి రోజు సెట్స్ మీదకు వెళ్లినప్పుడు.. తను చాలా సినిమాలు చేశారు కదా, తనతో చెయ్యడం సౌకర్యంగా ఉంటుందా లేదా అనుకున్నా. కానీ తను ఒక కాలేజ్ బాయ్ లా కనిపించారు. కూర్చొని ఫోన్ చూసుకుంటూ, వెంకీతో మాట్లాడుతూ నవ్వుతూ ఉంటారు. దాంతో నేను సౌకర్యంగా ఫీలయ్యా. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలా కలిసిపోయాం.”
భీష్మ సినిమా కేవలం లవ్ స్టోరీ కాదని, ఇందులో ఆర్గానిక్ ఫార్మింగ్ అనే టాపిక్ ను చర్చించామనే విషయాన్ని రష్మిక కూడా బయటపెట్టేసింది. సినిమాలో తను చైత్ర అనే పాత్ర పోషించానని, భీష్మ ఆర్గానిక్ కంపెనీలో పనిచేస్తుంటానని చెప్పుకొచ్చింది రష్మిక.