నితిన్ బర్త్ డే లుక్

భీష్మ హిట్ తో జోష్ మీద వున్న నితిన్ తరువాత సినిమా రంగ్ దే ను చకచకా ఫినిష్ చేసి విడుదల చేయాలనుకున్నాడు. అదే సమయంలో తన పెళ్లికి ముహుర్తం పెట్టుకుని ఏర్పాట్లు కూడా…

భీష్మ హిట్ తో జోష్ మీద వున్న నితిన్ తరువాత సినిమా రంగ్ దే ను చకచకా ఫినిష్ చేసి విడుదల చేయాలనుకున్నాడు. అదే సమయంలో తన పెళ్లికి ముహుర్తం పెట్టుకుని ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. కానీ కరోనా కల్లోలం ఊహించని విధంగా విరుచుకుపడింది. దీంతో అన్నీ వాయిదా పడిపోయాయి.

అయితే ఈ నెల 30న నితిన్ బర్త్ డే. మామూలుగా అయితే  హీరో బర్త్ డే సందర్భంగా సందర్బంగా హడావుడి కాస్త ఎక్కువే వుంటుంది. అయితే కరోనా కాలం కాబట్టి నితిన్ బర్త్ డే  హడావుడి వాయిదా వేసుకున్నాడు. కానీ రంగ్ దే లుక్ ఒకటి వదలడం మాత్రం మర్చిపోలేదు. సినిమా విడుదల చాలా దూరం వుంది. అందువల్ల ఏదో ఒకటి నామినల్ గా వదిలేస్తే చాలు అన్న టైపులో ఓ మోషన్ పోస్టర్ వదిలారు.

పెద్దగా చెప్పుకోవడానికి, చూడడానికి ఏమీ లేదు ఇందులో. జస్ట్ అకేషన్ అని వదిలినట్లుంది. అంతే. రంగ్ దే సినిమా మీద మంచి హోప్ వుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే జూన్ లో థియేటర్లలోకి వచ్చేది. ఇప్పుడు ఎప్పుడు వస్తుందన్నది మాత్రం తెలియదు.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో తయారవుతున్న ఈ సినిమాకు సూర్య దేవర నాగవంశీ నిర్మాత.