నితిన్ సినిమాకు ఏమైంది?

హీరో నితిన్ మాత్రమే కాదు..అతని ఫ్యామిలీ అంతా బోలెడు ఆశలు పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం విడుదలై నాలుగు నెలలు దాటిపోతోంది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడమే కాదు, బాగా నిరాశకు కూడా గురించేసింది.…

హీరో నితిన్ మాత్రమే కాదు..అతని ఫ్యామిలీ అంతా బోలెడు ఆశలు పెట్టుకున్న మాచర్ల నియోజకవర్గం విడుదలై నాలుగు నెలలు దాటిపోతోంది. ఆ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడమే కాదు, బాగా నిరాశకు కూడా గురించేసింది. ఆ సినిమా సంగతి ఇక వదిలేస్తే తరువాత సినిమా కూడా ఇప్పటి వరకు పక్కాగా ప్రారంభం కావడం లేదు. 

నా పేరు సూర్య లాంటి భయంకరమైన డిజాస్టర్ ఇచ్చిన తరువాత పక్కన వుండి పోయిన రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ చేయబోయే సినిమా ఇది. ఈ కథ మీదే వక్కంతం ఏళ్ల తరబడి ఎక్సర్ సైజ్ చేస్తున్నారు. మాచర్ల ఫ్లాప్ తరువాత ఈ ఎక్సర్ సైజ్ మరింత పెరిగింది.

ఆఖరికి ఆ మధ్య ఓ చిన్న షెడ్యూలు మారేడుమిల్లిలో చేసారు. అంతే. మరి ఆ తరువాత ఇప్పటి వరకు బండి ముందుకు కదలలేదు. ప్రారంభించడానికి అంటే సమయం అవసరమైంది అనుకోవచ్చు. ఎందుకంటే గెడ్డం పెంచి గెటప్ కు రెడీ కావాలి కనుక. కానీ ఆ వర్క్ అయిపోయింది కనుక ఇక చకచకా షూటింగ్ ఎందుకు చేయడం లేదు అన్నది ప్రశ్న.

పోనీ తొందరలేదేమో అనుకున్నా, వెనుక మరో సినిమా ప్లానింగ్ లో వుంది. సక్సెస్ ఫుల్ డైరక్టర్ వెంకీ కుడుమల తో నితిన్ చేయబోయే సినిమా అది. మైత్రీ బ్యానర్ నిర్మాణం. ఇది కచ్చితంగా ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అవుతుంది. మరి ఇంత ప్రామిసింగ్ ప్రాజెక్టు వెనుక వున్నపుడు, చేతిలో వున్నదాన్ని త్వరగా ఫినిష్ చేయాలి. కానీ అలాంటి దిశగా వార్తలు వినిపించడం లేదు. ఈ సినిమాను పక్కన పెట్టి నేరుగా ఆ సినిమా మీదకు వెళ్తాడేమో నితిన్ అనే గ్యాసిప్ లు అందుకే వినిపిస్తున్నాయేమో?