Advertisement

Advertisement


Home > Movies - Movie News

నితిన్-వక్కంతం-సైతాన్

నితిన్-వక్కంతం-సైతాన్

సినిమాకు కథ ఎంత ముఖ్యమో టైటిల్ అంతకన్నా కీలకం..అసలు ఇదే పెద్ద సమస్య కూడా ఒక్కోసారి. ట్రెండ్ కు తగినట్లు టైటిల్ వుండాల్సిందే. 

టెంపర్, లైగర్, పాగల్, మైకేల్, ధమాకా..ఢంమ్కీ… ఇలా సమస్త పదజాలమూ టైటిల్స్ నే. పఠాన్ సినిమా వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద హిట్ నో తెలిసిందే. ఇప్పుడు అదే సౌండ్ తో వుండేలా సైతాన్ అనే టైటిల్ ఒకటి వినిపిస్తోంది. ఈ టైటిల్ ఇంకా ఫిక్స్ కాలేదు కానీ, హీరో నితిన్-వక్కంతం వంశీ సినిమాకు అయితే ఈ టైటిల్ పరిశీలనలో వుంది.

నితిన్-వక్కంతం వంశీ కాంబినేషన్ లో ఓ సినిమా సెట్ మీద వున్న సంగతి తెలిసిందే. ఇంకా ఇప్పుడిప్పుడే షూటింగ్ జ‌రుపుకుంటున్న సినిమా ఇది. ఈ సినిమాకు బజ్ రావాలంటే షూటింగ్ టైమ్ నుంచీ హడావుడి జ‌రగాలి. అలా జ‌రగాలి అంటే టైటిల్ ఫిక్స్ కావాలి. అందుకే ఇప్పుడు యూనిట్ టైటిల్ మీద కసరత్తు చేస్తోంది.

ఇప్పటి వరకు షార్ట్ లిస్ట్ చేసిన టైటిళ్లలో సైతాన్ అనే టైటిల్ ఒకటి అని తెలుస్తోంది. ఇది నెగిటివ్ సౌండ్ వస్తుందా? లేదా బాగానే వుంటుందా? అన్న డిస్కషన్లు సాగుతున్నాయి. వన్స్ ఫైనల్ అయితే అయితే ఉగాదికి లేదా నితిన్ బర్త్ డే కు అనౌన్స్ మెంట్ వచ్చేస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?