నిత్యామీనన్ సినిమాలు అడపాదడపా తెలుగులో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఆమె రీసెంట్ గా చేసిన తెలుగు స్ట్రయిట్ మూవీ ఏంటని అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం కష్టం. అలా టాలీవుడ్ కు ఆమె మెల్లమెల్లగా దూరమైపోతోంది. అప్పుడెప్పుడో జనతా గ్యారేజ్ లో సెకెండ్ హీరోయిన్ గా నటించింది.ఆ తర్వాత గీతగోవిందంలో గెస్ట్ రోల్ చేసింది. అంతే ఆ తర్వాత మళ్లీ ఆమె నేరుగా తెలుగులో సినిమా చేసిన దాఖలాల్లేవు. మళ్లీ ఇన్నాళ్లకు మరో తెలుగు సినిమాకు ఓకే చెప్పింది ఈ మల్లూ బ్యూటీ.
స్కై లాబ్ అనే వర్కింగ్ టైటిల్ తో తెలుగులో ఓ సినిమా రాబోతోంది. టైటిల్ చూసి ఇదేదో సైన్స్ ఫిక్షన్ సినిమా అనుకోవద్దు. 1979లో కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో జరిగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది నిత్యామీనన్. కొత్త ఏడాదిలో జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. సత్యదేవ్ హీరో.
అమెరికా నెలకొల్పిన అంతరిక్ష కేంద్రం స్కైలాబ్ కూలిపోతుందంటూ 1979లో ప్రపంచవ్యాప్తంగా పుకార్లు వచ్చాయి. అది కూలితే భూమిలో సగభాగం అంతరించిపోతుందని చాలామంది అప్పట్లో పుకార్లు పుట్టించారు. ఇక ఇవే ఆఖరి క్షణాలంటూ చాలామంది అప్పట్లో ఇష్టారీతిన ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. మరికొంతమంది తమ భూములు, ఇళ్లు కూడా అమ్ముకున్నారు.
అలాంటి పరిస్థితుల్లో కరీంనగర్ లో కొన్ని కుటుంబాల మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలొచ్చాయి, తిరిగి వారు ఎలా కలిశారు లాంటి ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. సినిమా మొత్తం నిత్యామీనన్ చుట్టూ తిరుగుతుంది. ఈమె ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇదే కారణం. పలు షార్ట్ ఫిలిమ్స్ తీసిన విశ్వక్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన కే.ఎఫ్.సి ఎంటర్ టైన్ మెంట్స్ ఈ మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతోంది.
'సరిలేరు' కథ సగం చెప్పేసారు