వరుసగా ప్రమోషన్ టూర్ చేస్తున్న పుష్ప టీమ్ కు ఈస్ట్ గోదావరి కాకినాడలో చుక్క ఎదురైంది. తిరుపతి, చెన్నయ్ తరువాత కాకినాడలో జరగాల్సి వుంది.
శుక్రవారం సాయంత్రానికి ఈ ఈవెంట్ ప్లాన్ చేసారు. అయితే చటుక్కున క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందన్నది ఎవరికీ సమాచారం లేదు. అయితే విళ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఆర్డీవో నుంచి అనుమతి రాలేదని తెలుస్తోంది.
ఆంధ్రలో టికెట్ లు, థియేటర్ల రగడ నడుస్తోంది. ఇప్పటికే హీరో నాని ప్రభుత్వ విధానంపై విమర్శలు చేసారు. హీరో బన్నీ కూడా కాకినాడలో ఈ విషయమై స్పందిస్తారని అధికార వర్గాలకు అనుమానం కలిగినట్లు బోగట్టా.
దాంతో అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది. చేసేది లేక పుష్ప టీమ్ హైదరాబాద్ చేరుకుంది. టికెెట్ రేట్లు తక్కువ వున్నా ఆంధ్రలో ఫుట్ పాల్ బాగానే వుంది. అది అలా కంటిన్యూ అయ్యేలా ప్రమోషన్ చేద్దాం అంటే మాత్రం ఇలా అయింది.