మే నెల అన్నారు.. ఆగస్ట్ వస్తోంది

సలార్-2కు సంబంధించి మేటర్ ఇది. సలార్ హిట్టయిన వెంటనే సలార్-2పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా సలార్ క్లయిమాక్స్ చూసిన తర్వాత పార్ట్-2పై అంచనాలు, విశ్లేషణలు, ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. Advertisement ఈ…

సలార్-2కు సంబంధించి మేటర్ ఇది. సలార్ హిట్టయిన వెంటనే సలార్-2పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా సలార్ క్లయిమాక్స్ చూసిన తర్వాత పార్ట్-2పై అంచనాలు, విశ్లేషణలు, ఎదురుచూపులు ఎక్కువయ్యాయి.

ఈ బజ్ ను మరింత పెంచుతూ వేసవి నుంచి సలార్-2 సెట్స్ పైకి వస్తుందని మేకర్స్ గతంలో ప్రకటించారు. ఆ తర్వాత ఇంకాస్త క్లారిటీ ఇస్తూ మే చివరి వారం నుంచి అన్నారు. మరో వారం రోజులు గడిస్తే ఆగస్ట్ వస్తుంది. అయినప్పటికీ ఇంతవరకు సెట్స్ పైకి రాలేదు సలార్.

సలార్ కోసం వేసిన ఓ సెట్ ను పార్ట్-2 కోసం అలానే ఉంచారు. సెట్ రెడీగా ఉన్నప్పటికీ సినిమా స్టార్ట్ అవ్వలేదు. ప్రభాస్ బిజీగా ఉండడంతో కాల్షీట్లు సెట్ అవ్వలేదన్నారు, అయినప్పటికీ హీరోతో సంబంధం లేని సన్నివేశాలు తెరకెక్కిస్తామని.. శృతిహాసన్, బాబి సింహా లాంటి నటులు అందుబాటులో ఉన్నారని చెప్పుకొచ్చారు. కానీ అది కూడా జరగలేదు.

మరోవైపు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ చేయాల్సిన సినిమా తరుముకొస్తోంది. దేవర సినిమా పూర్తయితే నీల్ పై ఒత్తిడి పెరగడం ఖాయం. దీనికితోడు ఇప్పుడు అజిత్ తో కూడా నీల్ ఓ సినిమా చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఇవన్నీ జరగాలంటే ముందుగా సలార్-2 సెట్స్ పైకి రావాలి.

అదెప్పుడనేది మాత్రం మేకర్స్ చెప్పడం లేదు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూ, రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. అతడు తిరిగి ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో తెలిస్తే, అప్పుడు సలార్-2 షూటింగ్ పై కూడా అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది.

2 Replies to “మే నెల అన్నారు.. ఆగస్ట్ వస్తోంది”

Comments are closed.