కీర్తి సురేష్ అప్ కమింగ్ మూవీ మిస్ ఇండియా. ఈ సినిమా ఓటిటికి అని కొన్ని నెలల కిందటే కరోనా నేపథ్యంలో ఫిక్స్ అయిపోయింది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు.
ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ పదిన్నర కోట్లకు కొనుగోలు చేసినట్లు బోగట్టా. ఇప్పుడు విడుదలను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో మిస్ ఇండియా విడుదల కాబోతోంది.
ఈ మేరకు ఈ రోజు సినిమా ట్రయిలర్ ను విడుదల చేస్తూ ప్రకటించబోతున్నారని బోగట్టా. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మించిన ఈ సినిమాకు నరేంద్రనాధ్ దర్శకుడు.
దాదాపు మూడు వంతుల సినిమా విదేశాల్లో చిత్రీకరించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ దే కీలకపాత్ర. హీరోయిన్ చుట్టూ కథ తిరిగే ఈ సినిమాలో జగపతిబాబు కీలకమైన ప్రత్యర్థి పాత్రను పోషించారు. థమన సంగీత దర్శకుడు.