ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా ఇప్పటిది కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ పాటికే ఇది సెట్స్ పైకి రావాలి. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా లేట్ అవుతూ వస్తోంది. అలా ఇప్పటివరకు సెట్స్ పైకి రాని ఈ సినిమాకు విడుదల తేదీ లాక్ చేశారు.
ఎన్టీఆర్-కొరటాల శివ సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. మరో 4 నెలల్లో సినిమా వచ్చేస్తుందని ఆనందపడొద్దు. ఈ సినిమా రిలీజ్ అయ్యేది ఈ ఏడాది ఏప్రిల్ 5న కాదు.. 2024 సంవత్సరంలో.
ఈ సినిమా సెట్స్ పైకి వచ్చే ప్రకటన కూడా వచ్చేసింది. వచ్చే నెల (ఫిబ్రవరి) నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకురాబోతున్నారు. అంటే.. దాదాపు ఏడాది పాటు కొరటాల శివ సినిమాపైనే ఉండబోతున్నాడు తారక్.
ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్నాడు ఎన్టీఆర్. అందుకే అప్పటికే లాక్ చేసిన కథను కూడా పక్కనపెట్టి, కొరటాలతో మరో పాన్ ఇండియా కథ తయారుచేయించాడు. ఇప్పుడు ఆ కథతోనే సెట్స్ ఎక్కబోతున్నారు.
అనిరుధ్ ను ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. లొకేషన్లు కూడా లాక్ చేశారు. జాన్వి కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. త్వరలోనే ఆ ప్రకటన కూడా రాబోతోంది.