ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఈ నెల 24 నుంచి సెట్ మీదకు వెళ్లబోతోంది. పూజ కు డేట్ ఫిక్స్ అయింది. ఈ లోగానే సినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో దాదాపు సగానికి పైగా కథ చక్కర్లు కొట్టేసింది. ఇది నిజమో కాదో తెలియదు..అలాగే ఇప్పటి వరకు వినవచ్చిన వార్తలను బట్టి అల్లేసారో తెలియదు. కానీ ఈ లీక్ స్టోరీ ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ డబుల్ రోల్ అంటూ తెలుస్తోంది.
సముద్రం, పోర్ట్, స్మగ్లిింగ్ నేపథ్యంలో అల్లుకున్న కథ అని యూనిట్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్లు, విడియోల వల్లే తెలుస్తోంది. చక్కర్లు కొడుతున్న కథలో కూడా అదే వుంది. అయితే కొత్తగా ఈ (కట్టు) కథలో చెబుతున్నది ఏమిటంటే, తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ డబుల్ రోల్, అలాగే రివెంజ్ డ్రామా అన్నది.
కానీ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమా చేస్తూ దర్శకుడు కొరటాల ఇంత సింపుల్ కథ రాసుకుంటారు అని అనుకుంటే తప్పే అవుతుంది. కచ్చితంగా ఇప్పటి వరకు టచ్ చేయని విషయాలు కచ్చితంగా వుంటాయని అనకోవచ్చు.
కొరటాల సినిమా కథ ఇలా వుంటుంది అని లీక్ లు రావడం ఇదేం కొత్త కాదు. ఆచార్య విషయంలో కూడా ముందుగా ఇలాగే లీకులు వచ్చాయి. కానీ తీరా సినిమా వచ్చాక అవన్నీ కరెక్ట్ కాదని తెలిసింది. అందువల్ల ఎన్టీఆర్ సినిమా కథ ఎలా వుంటుందో తెలియాల్సి వుంది. అలాగే డబుల్ రోల్ అన్న క్లారిటీ సినిమా సెట్ మీదకు వెళ్లాక అయినా రావాల్సి వుంటుంది.