స‌ల్మాన్ పై జూనియ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం!

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు తెలుగు స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ హిందీ వెర్ష‌న్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఇది చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్…

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు తెలుగు స్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్. బిగ్ బాస్ హిందీ వెర్ష‌న్ లేటెస్ట్ ఎపిసోడ్ లో ఇది చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ ప్ర‌చార‌పర్వంలో ఉన్న ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, అలియా భ‌ట్.. వీళ్లంతా బిగ్ బాస్ షో లో పాల్గొన్నారు. ఏ సినిమా ప్ర‌చార స‌మ‌యంలో ఆ సినిమా వాళ్లు బిగ్ బాస్ హౌస్ ను ట‌చ్ చేయ‌డం రొటీనే.

ఈ క్ర‌మంలో హిందీ బిగ్ బాస్ షోలో ఈ స్టార్లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా స‌ల్మాన్ ను ఆకాశానికెత్తాడు జూనియ‌ర్. త‌న స్వానుభావాన్ని వివ‌రిస్తూ స‌ల్మాన్ ను ప్ర‌శంసించాడు ఎన్టీఆర్. ఈ న‌టుడు బిగ్ బాస్ తెలుగు వెర్ష‌న్ కు ఒక సీజ‌న్ లో హోస్టుగా వ్య‌వ‌హ‌రించిన సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ను కూడా బిగ్ బాస్ హోస్టేజ్ విష‌యంలో ఎన్టీఆర్ ప్ర‌శంసించాడు.

హిందీ బిగ్ బాస్ కు చాలా యేళ్లుగా స‌ల్మాన్ హోస్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. మధ్య‌లో కొన్ని సీజ‌న్లు మిస్ అయినా, హిందీ బిగ్ బాస్ షోకు ప‌ర్యాయ‌ప‌దంగా నిలిచాడు స‌ల్మాన్. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్ స్పందిస్తూ.. హిందీ వెర్ష‌న్ ను స‌ల్మాన్ అద్భుతంగా నిర్వ‌హిస్తూ ఉన్నాడ‌ని, అది పేరుకు బిగ్ బాస్ అయినా, బిగ్ భాయ్ షో అని ఎన్టీఆర్ కొత్త నిర్వ‌చ‌నాన్ని ఇచ్చాడు. బిగ్ బాస్ షో ఇండియాలో ఇంత హిట్ కావ‌డంలో స‌ల్మాన్ ఖాన్ కృషి ఎంతో ఉంద‌ని, ఆ షో కు ఊపునిచ్చింది భాయ్.. అని ఎన్టీఆర్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు.

ఒక సీజ‌న్ లో బిగ్ బాస్ హోస్టుగా వ్య‌వ‌హ‌రించిన అనుభ‌వం ఉన్న ఎన్టీఆర్ ఇలా అదే బాధ్య‌త‌ల విష‌యంలో స‌ల్మాన్ ను ఆకాశానికెత్తాడు. ఆర్ఆర్ఆర్ టీమ్ డ్యాన్సులు, న‌వ్వుల తో ఈ ఎపిసోడ్ సాగింది. ఇదే వేదిక‌పై స‌ల్మాన్ ఖాన్ బ‌ర్త్ డే ను అడ్వాన్స్డ్ గా సెల‌బ్రేట్ చేశారు.