హైదరాబాద్లో ఎన్టీఆర్ కుటుంబం స్టూడియో అంటే నాచారం రామకృష్ణా హార్డికల్చరల్ సినీ స్టూడియో అనే అనుకుంటారు చాలా అంటే చాలా మంది. కొందరు మేధావులు కూడా అదే నమ్మి, ఎన్టీఆర్ ప్రభుత్వ స్థలం తీసుకోకుండా తన స్వంత స్ధలంలో స్టూడయో కట్టుకున్న మహానుభావుడు అంటూ పోస్ట్ లు కూడా పెడుతున్నారు. కానీ అది కాదు విషయం.
ఎఎన్నార్, కృష్ణ అందరితో పాటే ఎన్టీఆర్ కూడా స్టూడియోకి స్థలం తీసుకున్నారు. అయితే వాళ్ల మాదిరిగా రాళ్లు రప్పల్లో కాదు. అన్నపూర్ణకు ఇచ్చిన స్థలం చూస్తే భయపడే పరిస్థితి. ఎందుకంటే అంతా కొండలు, గుట్టలు, రాళ్లు,రప్పలు. కానీ ఎన్టీఆర్ మిగిలిన వారిలా కాదు.
ఆయన చాలా తెలివిగా ముషిరాబాద్ దగ్గర స్థలం తీసుకున్నారు. సికింద్రబాద్ సమీపంలోని ముషీరాబాద్ అప్పటికే అభివృద్ది చెందిన ప్రాంతం. సినిమా అంటే క్రాస్ రోడ్స్. అలాంటి క్రాస్ రోడ్స్ కు దగ్గర. అక్కడ ఆయన ఆర్కే సినీ స్టూడియోస్ నిర్మాణం చేసారు. అయితే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత నాచారంలో రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియో నిర్మాణం మొదలుపెట్టారు.
అక్కడే ఓ గమ్మత్తు జరిగింది అని అప్పటి సంగతులు తెలిసిన వారు అంటారు. ముషిరాబాద్ ప్రాంతంలో జనాభా బాగా పెరిగిపోయినందున, దాన్ని వాణిజ్య పరంగా వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ స్టూడియో అధినేతగా ప్రభుత్వానికి లేఖ రాసారు. దానికి బదులుగా నాచారంలో స్టూడియో నిర్మిస్తామని ప్రతిపాదించారు. తరువాత ఆయనే ముఖ్యమంత్రి హోదాలో అనుమతి ఇచ్చేసారు. అప్పట్లో ఇలా డబుల్ పోజ్ వ్యవహారాన్ని ప్రతిపక్షాలు తప్పు పట్టాయి కూడా. కానీ అవన్నీ నడిచేవి, తెలుగుదేశం అను కుల మీడియాలో వినిపించేవి కాదు కదా?
ఆ విధంగా ఆ ఉదంతం ముగిసిపోయింది. ఉత్తరోత్తరా ముషీరాబాద్ స్టూడియోను షాపింగ్ క్లాంప్లెస్స్ గా మార్చారు. ఆర్కే కాంప్లెక్స్ అనేవారు దాన్ని ఇరవైకి పైగా షాపులు లైన్. గా వుండేవి. తరువాత ఆస్తి పంపకాల్లో ఒక కుమారుడికి వెళ్లడం, దాన్ని అతను విక్రయించే సమయంలో బాలకృష్ణ కొనుగోలు చేయడం, తరువాత రోడ్ వైడ్ నింగ్ లో కొంత జాగా పోతే, మిగిలిన దాన్ని ఓ బిల్డింగ్ గా కట్టి ఓ కాలేజీకి అద్దెకు ఇవ్వడం జరిగిపోయింది. అది వేరే సంగతి.
ఇక్కడ ఇంకో ముచ్చట ఏమిటంటే ఇలా రోడ్ వైడ్ నింగ్ లో జాగా పోయినందుకు కేసీఆర్ ను కలిసి వేరే దగ్గర జాగా కోసం బాలకృష్ణ దరఖాస్తు చేసుకున్నారని, మరి ఇచ్చారో, ఇవ్వలేదో తెలియాల్సి వుంది అన్నది మరి కొందరి మాట.