Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్...భీముడే

ఎన్టీఆర్...భీముడే

కొమరం భీమ్ గా కనిపించబోతున్నాడు ఎన్టీఆర్ రాబోయే ఆర్ఆర్ఆర్ సినిమాలో. భీమ్ గా ఎలా వుండబోతున్నాడో ఇప్పటికే చూపించేసారు రాజమౌళి. 

ఈరోజు మరోపోస్టర్ వచ్చింది. ఈ పోస్టర్ లో ఎన్టీఆర్ నిజంగా భీముడి లాగే వున్నాడు.. కండలు తిరిగిన శరీరం మొత్తం కనిపిస్తూ, రెండు తాళ్లు పట్టుకుని బలప్రదర్శన చేస్తున్న చిత్రం అది.

సినిమా విడుదల ఇంకో నెల రోజులు వుంది. దాంతో ప్రచారం ముమ్మరం చేసారు. అందులో భాగంగా రకరకలా పబ్లిసిటీ మెటీరియల్ వదులుతున్నారు. అందులో భాగంగానే ఈ స్టిల్ వచ్చింది. 

ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో సిక్స్ ఫ్యాక్ లు చేసిన వారు వున్నారు. రకరకాల శరీర ధారుడ్యంతో కూడిన స్టిల్స్ వచ్చాయి.

కానీ ఎన్టీఆర్ స్టిల్ మాత్రం యూనిక్ గా నిలిచిపోతుంది. రాజమౌళికి ఫ్యాన్స్ పల్స్ తెలుసు. అందులో పార్ట్ గానే ఈ స్టిల్ వచ్చింది ఇక రామరాజు స్టిల్ రాబోతోంది. ఇవన్నీ ఫ్యాన్స్ కు పండగ రోజులు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?