వాల్తేర్ వీరయ్య నుంచి రెండో పాట వచ్చింది. మాంచి కలర్ ఫుల్ డ్యూయట్. మెగాస్టార్ చిరంజీవి..శృతిహాసన్ తో డైరక్టర్ బాబి అందిస్తున్న సినిమా ఇది. ఇప్పటి వరకు వాల్తేర్ వీరయ్య అంటే పక్కా మాస్..అవతారం అనే చూపిస్తూ వచ్చారు. లుంగీ కట్టిన మాస్ మెగా అవతార్ నే చూసిన ఫ్యాన్స్ కు ఒక్కసారిగా ఫుల్ క్లాస్ గెటప్ లో చూపించాడు బాబీ.
పాట ట్యూన్..సాహిత్యం సంగతి పక్కన పెడితే చిత్రీకరణ మాత్రం అవుట్ అండ్ అవుట్ కలర్ ఫుల్ అండ్ క్లాస్ గా వుంది. ఫారిన్ లోకేషన్ లో చిత్రీకరించిన ఈ పాటలో మెగాస్టార్ లుక్ చూస్తే ఓ ఇరవై ఏళ్లు వయసు తగ్గినట్లు కనిపించారు. లుక్స్ అంత బాగున్నాయి. ఆ మాటకు వస్తే శృతినే పెర్ ఫెక్ట్ మ్యాచ్ కాలేదేమో అనిపించింది.
మెగాస్టార్ ఈ పాటలో చూపించిన కొన్ని కొన్ని డ్యాన్స్ మూవ్ మెంట్స్ ఫ్యాన్స్ ను కచ్చితంగా అలరిస్తాయి. ఇక పాట విషయానికి వస్తే..పాట మీద ‘ సన్న జాజిలా పుట్టేసిందిరో మల్లె తీగల చుట్టేసిందిరో..సుందరి’ పాట ప్రభావం కొంత వుందని అనిపిస్తుంది. మొత్తం మీద వాల్తేర్ వీరయ్య ను టోటల్ గా ఫ్యాన్స్ ప్యాక్ గా తయారు చేస్తున్నట్లుంది మైత్రీ మూవీస్ సంస్థ.