అగ్ర నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ పతాకంపై చెందు ముద్దు దర్శకుడిగా తయారైన సినిమా ఓ పిట్టకథ. క్యూట్ లవ్ స్టోరీని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ముడిపెట్టి తయారుచేసిన ఈ సినిమాలో విశ్వంత్ దుద్దుంపూడి, సంజయ్రావు హీరోలుగా, నిత్యాశెట్టి నటించారు. ఈవారం విడుదల కాబోతున్న సందర్భంగా మీడియా మీట్ నిర్వహించారు.
ఈ మీడియా మీట్ లో బ్రహ్మాజీ మాట్లాడుతూ, “ఓ పిట్ట కథ సినిమాను డైరెక్టర్ చెందు ముద్దు సినిమా చాల ముద్దుగా తీశారు. ఈ ఓ పిట్టా కథ వెనుక ఓ చిన్న పిట్ట కథ ఉంది, ఆయన మొదట ఒక కాన్సెప్ట్ తో మా దగ్గరికి వచ్చాడు. నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు డైరెక్టర్ ఫ్రెండ్స్ చెందు గురించి చాల బాగా చెప్పారు.
ఒక రోజు ఆ కాన్సెప్ట్ మీద ఒక షార్ట్ ఫిలిం చేద్దాం అని అడిగారు, నాకు డేట్స్ కుదరక వద్దన్నాను. తరువాత అదే కథతో ఒక డెమో ఫిలిం చూపించారు, థ్రిల్లింగ్ గా అనిపించింది అదే సమయంలో భవ్య క్రియేషన్స్ అన్నే రవి ని కలవటం, ఆనంద్ ప్రసాద్ గారికి కూడా ఇది నచ్చడం జరిగిపోయాయి.
అదే సమయంలో అక్కడే ఉన్న చంద్ర శేఖర్ యేలేటి గారికి కూడా దీని గురించి చెప్పడం ఆయన స్క్రీన్ ప్లే నచ్చడంతో దాన్ని డెవెలప్ చేసి సినిమాగా ఎలా తియ్యొచ్చు అన్నదానిపై డైరెక్టర్ కి సూచనిలిచ్చారు. ఈ సినిమా అలా మొదలయ్యింది అని వివరించారు.
ప్రొడ్యూసర్ ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ' ” ఉత్కంఠంగా సాగే సన్నివేశాలతో, అందమైన విజువల్స్ తో మా 'ఓ పిట్ట కథ' మీ అందరిని అలరిస్తుంది. చిత్రానికి సంబంధించిన లుక్స్ కి ప్రీ టీజర్ కి అనూహ్య స్పందన లభించడం ఆనందంగా ఉంది. వినోదం, ప్రేమ, సస్పెన్స్ తో మంచి కంటెంట్ ఉన్న చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాం.
డైరెక్టర్ చెందు ముద్దు మాట్లాడుతూ, “మా సినిమా కి సెన్సార్ వాళ్ళు క్లీన్ యు ఇచ్చారు. మా హీరోయిన్ వెంటక లక్ష్మి పాత్ర లో నిత్యా అనుకున్న దానికంటే బాగా చేసింది. విశ్వంత్ మా సినిమాకి మంచి అసెట్. సంజయ్, నేను ఎప్పటినుండో ట్రావెల్ చేస్తున్నాం, ఆయన టాలెంట్ నాకు బాగా తెలుసు. మా పిట్టా కథ మీ అందరికి బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.