ప్రభాస్ తో ఉన్న రిలేషన్ గురించి బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పేశారు. వరుణ్ ఓ టీవీ షోలో ప్రభాస్ నా గురించి చేసిన వ్యాఖ్యలతో నా ఫ్రెండ్స్ అందరూ నాకు కంగ్రాట్స్ అంటూ మెసేజెస్ చేశారు. పెళ్లి ఎప్పుడు అని అడిగారు. కానీ మా మధ్య ఏం లేదు. అందుకే నేను మళ్లీ రియాక్ట్ అయి ప్రభాస్ కు ఫోన్ చేసి వరుణ్ చేసిన పనిని చెప్పితే ఇలా ఎందుకు చేశారని అడిగాడు అంటూ చెప్పుకొచ్చింది.
గతంలో ఓ టీవీలో షోలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ను కరణ్ జోహార్ ఒక ప్రశ్న అడిగారు. నీ జాబితాలో కృతి పేరు ఎందుకు మిస్ అయ్యింది అని కరణ్ అడగడంతో.. ‘‘ఆమె పేరు వేరే హృదయంలో ఉంది’’ అని వరుణ్ అన్నారు. ఎవరా వ్యక్తి అని కరణ్ అనగానే.. ‘‘ముంబైలో లేని ఒక వ్యక్తి. ప్రస్తుతం అతను దీపికాతో షూటింగ్లో ఉన్నాడు’’ అని వరుణ్ చెప్పడంతో ప్రభాస్- కృతి సనన్ రిలేషన్‌షిప్‌పై రూమర్లు వచ్చాయి.
కాగా ’ఆదిపురుష్’ సినిమాలో హీరోహీరోయిన్లుగా ప్రభాస్, కృతి సనన్ లు నటిస్తున్నారు. వరుణ్ చేసిన వ్యాఖ్యలే వల్లే పుకార్లకు దారితీశాయని, ప్రభాస్ తో తనకు ఎలాంటి రిలేషన్షిప్ లేదని ఇంతకు ముందే క్లారిటీ ఇచ్చింది.