ఒటిటికి థియేటర్ కు ఎప్పుడూ పొసగదు. అయినా తప్పదు. కాలంతో వచ్చే మార్పులను స్వాగతించాల్సిందే కదా. అందుకే థియేటర్లు సర్దుకుపోతున్నాయి.
కానీ ఇప్పుడు మూడు వారాలకే థియేటర్ లో సినిమా వుండగానే ఓటిటికి ఇచ్చేయడం అన్నది మళ్లీ మరోసారి థియేటర్లను కలవరపడుతోంది. పేమెంట్ సిస్టమ్ ను మెలమెల్లగా ఓటిటి లో అలవాటు చేయడం ప్రారంభమైంది. ఇది ఇప్పుడు ఎగ్జిబిటర్లను మరింత కలవరపెడుతోంది.
జనానికి ఇది అలవాటు పడితే థియేటర్ల పరిస్థితి ఘోరంగా మారుతుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమా నెల రోజుల్లో సింగిల్ టికెట్ రేటుకన్నా తక్కువకు ఇంటిల్లి పాదీ ఇంట్లోనే చూడొచ్చు అనే భావన బలపడితే థియేటర్లు వెలవెల బోతాయి.
సర్కారు వారి పాట సినిమా కూడా ఇలాగే 21 రోజులకు ఇచ్చేయడం చూసి థియేటర్ల జనాలు నిన్నటికి నిన్న హైదరాబాద్ లో సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణ్ పై డిస్కస్ సాగించారు.
ఇలా అయితే సినిమాల విడుదలలు, థియేటర్ రెంట్లు ఇలాంటి విషయాల్లో ఏం చేయాలి? ఈ పరిస్థితిని ఎలా అడ్డుకోవాలి అనే విషయం పై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. పెయిడ్ సిస్టమ్ మీద ఓటిటికి సినిమాలు ఇవ్వడం పై ముందుగానే అడ్డకట్టవేయగలమా అన్నది ఇప్పుడు ఎగ్జిబిటర్ల బర్నింగ్ ఇస్యూగా వుంది.