సినిమా థియేటర్ల తెరుచుకోవడం, సినిమాల విడుదల వ్యవహారాలు మెలమెల్లగా సద్దుమణుగుతున్నాయి. ఆంధ్రలో రేట్ల వ్యవహారం ఇక ప్రభుత్వం చిత్తానికి వదిలేయాలనే ఆలోచనకు నిర్మాతలు వచ్చేసారు.
సెకెండ్ షో ఇస్తే చాలు. వంద శాతం ఆక్యుపెన్సీ వస్తే ఇంకా బెటర్ అనే అభిప్రాయంతో వున్నారు. ఇలాంటి నేపథ్యంలో థియేటర్లు మళ్లీ మూతపడకుండా కంటెంట్ అందిస్తే బెటర్ అని సినిమా పెద్దలు ఆలోచిస్తున్నారు.
తిమ్మరసు, ఇష్క్ వచ్చాయి. ఎంతో కొంత వసూళ్లు సాగించాయి. ఇంకా థియేటర్లలోనే వున్నాయి. ఎస్ ఆర్ కళ్యాణ మండపం, ఇంకా మరి కొన్ని సినిమాలు వచ్చాయి. ఎస్ ఆర్ కళ్యాణమండపం తొలిరోజు మంచి నెంబర్లు కళ్ల చూసింది. దాంతో వచ్చేవారానికి కూడా ఏదో ఒక మంచి సినిమా అందిస్తే ఎలా వుంటుందని గిల్డ్ పెద్దలు ఆలోచనలో పడ్డారు.
దిల్ రాజు దగ్గర వున్న పాగల్ సినిమాను వదిల్తే ఎలా వుంటుందనే ఆలోచన ప్రారంభమైంది. వాస్తవానికి దీన్ని ఓటిటికి ఇచ్చేద్దాం అనుకున్నారు. కానీ ఆగారు. విష్వక్ సేన్ నటించిన ఈ సినిమాను 13 లేదా 14న విడుదల చేస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం క్యాంప్ లో వున్న దిల్ రాజు ఈ రోజు వస్తారు. ఆయన రాగానే డెసిషన్ తీసుకుంటారు.