సాయి తేజ్-మారుతి కాంబినేషన్ లో తయారవుతున్న సినిమా ప్రతి రోజూపండగే. ఈ సినిమా నుంచి ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. బయటకు వచ్చిన టైటిల్ సాంగ్ కు మంచి ఆదరణ వచ్చి రెండు మిలియన్లకు పైగా హిట్ లు వచ్చాయి.
ఇప్పుడు రెండో పాట విడుదల చేసారు. బావా..మా అక్కను సక్కగ సూస్తావా అంటూ సాగే ఈపాట టీజర్ బయటకు రావడంతోనే మరో విషయం బయటకు వచ్చింది.
ఈ పాటలో రాశీఖన్నీ సోదరిగా ఓ అమ్మాయి తళుకున మెరిసింది. భరతనాట్యం డ్రెస్ లో వున్న ఆ అమ్మాయి పేరు అభీష్ట. ఈ అమ్మాయి ఎవరో కాదు. డైరక్టర్ మారుతి కుమార్తే. బేసిక్ గా అభీష్టం మంచి చిత్రకారణి. అయితే సరదాగా నటనలోకి కూడా అడుగుపెట్టింది.
ప్రతిరోజూ పండగే సినిమాలో రాశీఖన్నా ముగ్గురు చెల్లెళ్లలో ఒకరిగా అభీష్ట కనిపించబోతోంది. మారుతి తన ఇద్దరు పిల్లలను రెండు రంగాల్లో తీర్చిదిద్దుతున్నారు.
అమ్మాయి చిత్రకారిణిగా తర్ఫీదు పొందుతుంటే, కొడుకు డ్రమ్స్, వెస్ట్రన్, ఇండియన్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాడు.