సర్కారు వారి పాట సినిమా మరో రెండు వారాల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఆ తరువాత పరుశురామ్ సినిమా ఏమిటి? సింపుల్ ఆన్సర్. నాగ్ చైతన్యతో పరుశురామ్ సినిమా వుంటుంది.
నిజానికి ఈ ప్రాజెక్ట్ చాలా కాలం కిందటిదే. చైతూ-పరుశురామ్ కలిసి సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అది అలా వాయిదా పడుతూ వచ్చింది. ఈ లోగా మహేష్ తో సినిమా ఫిక్స్ అయింది.
అందుకే ఈ సినిమా తరువాత పక్కాగా చైతన్యతో సినిమా వుంటుందని తెలుస్తోంది. 14 రీల్స్ బ్యానర్ ఆ సినిమాను నిర్మిస్తుంది. ఇది కూడా గతంలో ఫిక్స్ అయినదే. ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా నిర్మాణంలో కూడా 14 రీల్స్ భాగస్వామిగా వుంది. పరుశురామ్ తరువాత సినిమా పూర్తిగా ఆ బ్యానర్ నే నిర్మిస్తుంది.
ప్రస్తుతం పరుశురామ్ సర్కారువారి పాట పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వున్నారు. మహేష్ డబ్బింగ్ పూర్తయింది. మే 12న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడందుకున్నాయి.