తన పెళ్లిళ్లపై పవన్ ‘పొలిటికల్’ ఆన్సర్స్

“ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా”.. పవన్ కల్యాణ్ కు బాలయ్య ప్రశ్న ఇది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కలిసి మాట్లాడుకున్న చిట్ చాట్ షోకు సంబంధించి తొలి ప్రోమో బయటకొచ్చింది. అందులో బాలయ్య ఇలా…

“ఈ పెళ్లిళ్ల గొడవేంటి భయ్యా”.. పవన్ కల్యాణ్ కు బాలయ్య ప్రశ్న ఇది. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కలిసి మాట్లాడుకున్న చిట్ చాట్ షోకు సంబంధించి తొలి ప్రోమో బయటకొచ్చింది. అందులో బాలయ్య ఇలా పవన్ ను 3 పెళ్లిళ్లపై ఓపెన్ గా అడిగేశారు. దానికి పవన్ కల్యాణ్ అంతే ఓపెన్ గా, ఓపిగ్గా సమాధానం చెప్పినట్టు ప్రోమోలో చూపించారు.

దీంతో చాలామంది పవన్ కల్యాణ్, తన 3 పెళ్లిళ్లపై పూర్తిస్థాయిలో పూర్తిస్థాయిలో ఓపెన్ అయ్యారని అనుకున్నారు. ఎందుకు తను 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చిందో నీట్ గా వివరించారని అనుకుంటున్నారు. కానీ అలాంటిదేం జరగలేదు.

పవన్ ను ఎంత ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడిగినప్పటికీ ఆయన సమాధానం చెప్పలేదని, తనదైన శైలిలో పొలిటికల్ గా సమాధానాలు చెప్పి, చాకచక్యంగా తప్పించుకున్నారని స్వయంగా ఆ షోను నిర్వహిస్తున్న బీవీఎస్ రవి బయటపెట్టారు.

“సాధారణంగా ఇంటర్వ్యూలు జరిగినప్పుడు సీట్లో కూర్చున్న ప్రముఖుడి నుంచి అప్రయత్నంగా తననుతాను సమర్థించుకునే సమాధానమే వస్తుంది తప్ప, బట్టబయలైపోయే ఆన్సర్లు రావు. అది మానవ సహజం. ఎవరైనా ఇంటర్వ్యూలో తననుతాను డిఫెండ్ చేసుకుంటారు. పవన్ కల్యాణ్ కూడా అదే చేశారు. పబ్లిక్ లో ఉన్న నాయకుడాయన. ఏ ప్రశ్న అడిగినా అప్పటికప్పుడు తడుముకోకుండా సమాధానం చెప్పడంలో ఆయన దిట్ట. బాలకృష్ణ ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగిన మాట వాస్తవం. ఆ ప్రశ్నలకు పవన్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. అలవోకగా పద్మవ్యూహం నుంచి బయటకొచ్చారు.”

ఇలా పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానాలు చెప్పకుండానే తప్పించుకున్నారనే విషయాన్ని బీవీఎస్ రవి పరోక్షంగా బయటపెట్టారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా ఆయన బయటపెట్టాడు.

చంద్రబాబును ఇంటర్వ్యూ చేసే టైమ్ లో ఇబ్బందిపెట్టే ప్రశ్నలు అడుగుతామని ముందే చెప్పారట. కానీ పవన్ కల్యాణ్ విషయంలో మాత్రం అలా జరగలేదంట. ప్రశ్నలపై బ్రీఫింగ్ ఇచ్చేందుకు వెళ్తే, ఏం అక్కర్లేదంటూ నేరుగా హాట్ సీట్లోకి వచ్చేశారట పవన్. అప్పటికప్పుడు బాలకృష్ణ ప్రశ్నలు అడిగితే, స్పాంటేనియస్ గా సమాధానాలు చెప్పారట. పెళ్లిళ్లపై కూడా బాలకృష్ణ ప్రశ్న అడిగారు, తననుతాను సమర్థించుకునేలా పవన్ దానికి సమాధానం ఇచ్చారు.