పవన్ ఫ్యాన్స్ ను కెలకడం ఇష్టం-ఆర్జీవీ

ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ మీద పవన్ ఫ్యాన్స్ తో ఆడుకోవడం, వాళ్లను కెలకడం అంటే తనకు ఇష్టమని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. నిజానికి వాళ్లు తాను ఏం…

ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ మీద పవన్ ఫ్యాన్స్ తో ఆడుకోవడం, వాళ్లను కెలకడం అంటే తనకు ఇష్టమని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అన్నారు. నిజానికి వాళ్లు తాను ఏం ట్వీట్ చేసాను అన్నది కూడా చూడరని, చదవరని, అవేవీ చేయకుండానే తనను తిట్టడం మొదలెట్టేస్తారని అన్నారు. 

తాను రాసే ఇంగ్లీష్ కానీ, కాంప్లికేటెట్ ఫ్రేజ్ లు, సెంటెన్స్ లు కానీ వారికి అర్థం కావని ఆయన అన్నారు. తాను కావాలనే అలా రాస్తానన్నారు. నిజానికి పవన్ అంటే తనకు ఏ ద్వేషం లేదని, ఏనాడూ ఆయనను విమర్శించలేదని అన్నారు. సెటైర్ వేయడం తప్ప విమర్శించడం చేయలేదన్నారు.

చంద్రబాబు అంటే తనకు నచ్చదని, ఎన్టీఆర్ కు వెన్నుపోటు ఉదంతంలో తనకు ఆయన అంటే ఓ నెగిటివిటీ స్థిరపడిపోయిందని, ఇక అది పోదని వివరించారు. చంద్రబాబు హైదరాబాద్ ను షాంగై చేసేస్తా అంటూ చెప్పే మాటలకు కూడా తనకు నచ్చవన్నారు. వైఎస్సార్ మరణించిన తరుువాత జగన్ ను తొలిసారి చూసానని, అతని మాట తీరు, బాడీ లాంగ్వేజ్ ఇలా ప్రతీదీ తనకు నచ్చాయని అన్నారు. కానీ జగన్ ఎలా పాలన సాగిస్తున్నారు, అది బాగా వుందా లేదా తనకు తెలియదు, అనవసరం అని కూడా అన్నారు.

వ్యూహం సినిమాలో పాజిటివ్..నెగిటివ్ రెండూ వుంటాయని, అయితే సినిమా జగన్ కు అనుకూలంగానే వుంటుందని అన్నారు. వ్యూహం సినిమాకు నిర్మాత దాసరి కిరణ్ అని, ఆయన వెనుక ఎవరన్నా వున్నా, ఎవరన్నా ఫండింగ్ ఇస్తున్నారా అన్నది తనకు తెలియదు, అనవసరమని అన్నారు.

తాను తీస్తున్న వ్యూహం సినిమాలో జగన్ పాత్ర వుంది కనుక, ఆయన గురించి తెలుసుకోవడానికి తాను కలిసానని అన్నారు. అయితే ఆయనేం చెప్పారు, తానేం తెలుసుకున్నాను అన్నది చెప్పనన్నారు. ప్రస్తుతం తాను ఓ ఫండింగ్, ప్రొడక్షన్ సంస్థను ప్రారంభించానని, కొత్తవారు ఎవరైనా మంచి ఐడియాలతో వచ్చినా, ఒక్క సీన్ మొబైల్ లో షూట్ చేసుకుని వచ్చినా తాను అవకాశం ఇస్తా అన్నారు. తననే కలవాల్సిన పని లేదని, దీనికి ఓ ప్రోటోకాల్, ఓ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నా అని వివరించారు.