పవన్ ముందు పడి పడి నవ్వారు ఆయన స్పీచ్ కు. ఆ తరువాత ఆయన సన్నాసి అన్న మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ కోరి, ఆయన రమ్మన్న మచిలీపట్నానికే కోరి వెళ్లారు.
పవన్ స్పీచ్ తరువాత పోసాని కౌంటర్ వచ్చింది. పవన్ కు మద్దతు అంతంత మాత్రం అయింది. ఇలాంటి టైమ్ లో పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదన్నట్లు తెలుగు ఛాంబర్ ఓ ప్రకటన ఇచ్చింది. ఇప్పుడు ఇవన్నీ చాలవన్నట్లు ఈ ప్రయాణం.
అంటే మొత్తానికి పవన్ ను ఒంటరిని చేసేసారు కదా? పవన్ మాటలను సింపుల్ గా విని, పడి పడీ నవ్వేసిన వారంతా, మరుక్షణం ఇది ఎక్కడ తమకు చుట్టుకుంటుందో అని కిందా మీదా అయిపోయినట్లే కదా? నిర్మాత దిల్ రాజుకు వైకాపా అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకోవడానికి యువి వంశీ సాయం తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది.
ఆ సంగతి అలా వుంచితే సినిమా ఛాంబర్ అలా ప్రకటన ఇవ్వడం, పవన్ భీమవరం ఎన్నికల వ్యవహారం చూసిన బన్నీ వాస్ తో సహా పలువురు ప్రముఖులు మంత్రి దగ్గరకు వెళ్లడం అన్నీ చూస్తుంటే పవన్ కు కంఠశోష తప్ప మరేమీ మిగిలినట్లు లేదు.
పైగా ఆయన ప్రసంగాన్ని పట్టించుకోకపోయినా ఫరవాలేదు. ఆయననే పట్టించుకోవద్దు అంటూ చెప్పడం అంటే..టూ మచ్ కదా?