Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్

పవన్ కల్యాణ్ నుంచి మరో రీ-రిలీజ్

టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ పీక్స్ కు చేరింది. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్, ప్రతి హీరోను తాకింది. స్టార్ హీరోల అభిమానులంతా తమ హీరోల హిట్ మూవీస్ ను రిలీజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ నటించిన హిట్ మూవీస్ కొన్ని ఇప్పటికే థియేటర్లలోకి మరోసారి వచ్చాయి. ఇప్పుడు మరో హిట్ మూవీ రాబోతోంది. దీన్ని హిట్ అనేకంటే క్లాసిక్ అంటే బాగుంటుందేమో.

అవును.. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన క్లాసిక్ మూవీ తొలిప్రేమ మరోసారి థియేటర్లలోకి వస్తోంది. రిలీజై పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 30న ఈ సినిమాను మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈ మూవీ రీ-మాస్టరింగ్ పనులు ఆల్రెడీ పూర్తయ్యాయి. వీడియోను 4కె రిజల్యూషన్ లోకి మార్చడంతో పాటు, ఆడియోను కూడా మరింత మెరుగుపరిచారు.

నిజానికి ఈ బ్లాక్ బస్టర్ మూవీపై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాన్నాళ్ల కిందటే కన్నేశారు. ప్రేమికుల రోజు కానుకగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా రీ-రిలీజ్ ఆగిపోయింది. ఇప్పుడు సినిమా సిల్వర్ జూబ్లీ సందర్భంగా రీ-రిలీజ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు.

పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఖుషి, జల్సా తమ్ముడు సినిమాలు ఆల్రెడీ రీ-రిలీజ్ అయ్యాయి. వీటిలో ఖుషీ సినిమా రీ-రిలీజ్ లో కూడా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు తొలిప్రేమ సినిమా ఆ రికార్డ్ ను క్రాస్ చేస్తుందని ఫ్యాన్స్ ఉబలాటపడుతున్నారు. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తొలిప్రేమకు చాలామంది అభిమానులన్నారు కాబట్టి ఈ సినిమా కచ్చితంగా మంచి వసూళ్లు సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?