పవన్ కన్నా బండ్ల కే క్రేజ్

దేవుడు సైలంట్ గా వుంటాడు. పూజారి పెద్దగా మంత్రాలతో సౌండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ దేవుడు..అందరికీ కాదు. బండ్ల గణేష్ లాంటి వాళ్లకి. ఆయనకు ఈయన పూజారి టైపు. అందుకే నిన్నటి అడియో ఫంక్షన్…

దేవుడు సైలంట్ గా వుంటాడు. పూజారి పెద్దగా మంత్రాలతో సౌండ్ చేస్తారు. పవన్ కళ్యాణ్ దేవుడు..అందరికీ కాదు. బండ్ల గణేష్ లాంటి వాళ్లకి. ఆయనకు ఈయన పూజారి టైపు. అందుకే నిన్నటి అడియో ఫంక్షన్ లో రెచ్చిపోయి మరీ తన బ్యానర్, తన దేవుడు అయిన పరమేశ్వరుడిని కూడా మరిచి 'పవనేశ్వరా' అంటూ స్తుతిగానం ప్రారంభించాడు. 

వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మొత్తానికి బండ్లనే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయాడు. ఫంక్షన్ స్పీచ్ లు అన్నీ ముక్కలు చేసి యూ ట్యూబ్ లో లోడ్ చేస్తే వ్యూస్ హిట్ అన్నీ బండ్ల విడియోకే. పవన్ స్పీచ్ ట్రెండింగ్ లోకి కూడా రాలేదు. బండ్ల స్పీచ్ ట్రెండింగ్ నెంబర్ వన్ అయిపోయింది. 

డైరక్టర్, నిర్మాత,ఇలా ఎవ్వరి స్పీచ్ లు ఆకట్టుకోలేదు. పవన్ అంత సేపు ఒకదాంట్లోంచి మరోదాంట్లోకి వెళ్తూ ఏదోదో మాట్లాడేసినా పాపం ట్రెండింగ్ కాలేదు. కానీ బండ్ల స్తుతి స్తోత్రం మాత్రం ట్రెండింగ్ అయిపోయింది. 

విశేషం ఏమిటంటే ఫంక్షన్ కు వచ్చిన గెస్ట్ లు, స్టేజ్ ఎక్కడి గెస్ట్ లు అంతా పవన్ రాబోయే సినిమాలతో ఏదో విధమైన కనెక్షన్ వున్నవారే. ఒక్క బండ్ల మాత్రమే ఏ కనెక్షన్ లేకుండా వచ్చిన వాడు. పిలవని పేరంటమో, పిలిచిన పేరంటమో కానీ స్పీచ్ ఇచ్చి ఫంక్షన్ కే కళ తెచ్చాడు.