పవన్ ను కలిసిన మైత్రీ టీమ్

ఏనాటి నుంచో పెండింగ్ లో వుంది మైత్రీ మూవీ మేకర్స్..పవన్ కళ్యాణ్ సినిమా. ఆ సినిమా అలా వుండగానే పవర్ స్టార్ వకీల్ సాబ్ ఒప్పుకున్నారు. అయ్యప్పన్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.…

ఏనాటి నుంచో పెండింగ్ లో వుంది మైత్రీ మూవీ మేకర్స్..పవన్ కళ్యాణ్ సినిమా. ఆ సినిమా అలా వుండగానే పవర్ స్టార్ వకీల్ సాబ్ ఒప్పుకున్నారు. అయ్యప్పన్ కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చారు.

మైత్రీ కన్నా ముందు బాకీ ఎఎమ్ రత్నం సినిమా వుండనే వుంది. ఈ మూడూ అయితే తప్ప మైత్రీ వంతు రాదు. దర్శకుడు హరీష్ శంకర్ పకడ్బందీ స్క్రిప్ట్ ను పవర్ స్టార్ కోసం రూపొందించే పనిలో బిజీగా వున్నారు. 

కరోనా తరువాత పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి బయటకు వచ్చి వకీల్ సాబ్ షూట్ స్టార్ట్ చేసారు. దాంతో ఆయనను కలిసినట్లుంటుంది..తమ సినిమా పరిస్థితి తెలుస్తుంది అని మైత్రీ టీమ్ మొత్తం వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిసి వచ్చారు. ఈ టీమ్ లో నిర్మాతలు నవీన్, రవి, దర్శకుడు హరీష్ శంకర్ వున్నారు.

డిసెంబర్ నాటికి వకీల్ సాబ్, ఏప్రియల్ నాటికి అయ్యప్పన్ రీమేక్ లు పూర్తయివుతాయి. ఆపైన క్రిష్ సినిమా బ్యాలన్స్ వర్క్ వుంటుంది. ఆ తరువాత మైత్రీ సినిమా.  వకీల్ సాబ్ సినిమా ప్రస్తుతం అన్నపూర్ణలోని సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది. 

బాబు జూమ్ సౌండుకి, వైసిపీ నో రీసౌండ్