పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా స్పీడ్ గా వున్నారు. ఇలా సినిమాలు ఓకె చేసారు. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లి భాజపాతో పొత్తు ఓకె చేసుకున్నారు. ఆ పొత్తు ఇలా ప్రకటించారు. ఇప్పుడు అలా సెట్ మీదకు వచ్చేస్తున్నారు. అవును..పవన్ మనసు మార్చుకున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.
వచ్చేనెలలో క్రిష్ సినిమాకు పది రోజులు, పింక్ సినిమాకు పది రోజులు కాల్ షీట్లు ఇచ్చిన పవన్ ఇప్పుడు అలా కాకుండా వెంటనే సెట్ మీదకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 20 నుంచి పింక్ షూట్ ప్రారంభం కాబోతోంది. ముందుగా కొన్ని వేరే సీన్లు తీస్తారని, ఫిబ్రవరిలో పవన్ సెట్ మీదకు వస్తారని వార్తలు వినవచ్చాయి.
కానీ అలా కాకుండా ఈ షెడ్యూలు లోనే పవన్ సెట్ మీదకు వచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. 20న లేదా 21న పవన్ సెట్ మీదకు రావచ్చు అని బోగట్టా. అంటే దీన్ని బట్టి సినిమాల్లో రావడానికి పవన్ ఎంత స్పీడ్ గా వున్నారో అర్థం అవుతోంది. పైగా గతంలో అయితే హీరోలు ఎక్స్ ర్ సైజ్ లు గట్రా చేసి సన్నబడడం గట్రా వుంటుంది. కానీ ఇప్పుడు సిజి వర్క్ లు వచ్చేసాయి కాబట్టి సమస్య లేదు.
అన్నపూర్ణ లో వేసిన కోర్టు సెట్ లో షూట్ ప్రారంభమవుతుంది.