Advertisement

Advertisement


Home > Movies - Movie News

పవన్ టీమ్ మాస్టర్ ప్లాన్

పవన్ టీమ్ మాస్టర్ ప్లాన్

పిఠాపురంలో కాపు సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ. వాటితో పాటే ఇంకా చాలా కులాల ఓట్లు వున్నాయి. మిగిలిన చోట్ల మాదిరిగా కాకుండా బ్రాహ్మణుల ఓట్లు కూడా కాస్త చెప్పుకోదగ్గర సంఖ్యలో వున్నాయి. అందువల్ల వాటిని రాబట్టడానికి కూడా జనసేన టీమ్ భలే ప్లాన్ లు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ మధ్య హడావుడిగా వదిలిన ఉస్తాద్ సినిమా టీజర్ లో బ్రాహ్మణులను విలన్ హింసిస్తుంటే హీరో ఎంటర్ అయినట్లు సీన్ చూపించారు.

లేటెస్ట్ గా నిన్నటికి నిన్న పిఠాపురంలో మరో సీన్ జరిగింది. పవన్ తన వారాహి ప్రారంభించారు. అలా ప్రారంభించిన ప్రదేశం పిఠాపురానికి ఓ పది పన్నెండు కిలోమీటర్ల దూరం. ఇక కాస్సేపట్లో వారాహి విజయభేరి ప్రారంభం అవుతుంది అనగా, వున్నట్లుండి పిఠాపురంలో వైదిక వృత్తి చేసే పురోహితులకు కబురు అందింది.

అర్జంట్ గా ఓ అరడజను మంది లేదా పది మంది బ్రాహ్మణులు బయలు దేరి ప్రచార స్థలికి రావాలి. సంభావనలు ఎలాగూ వుంటాయి. అది వేరే సంగతి. కానీ టైమ్ లేదు వెంటనే బయలు దేరి రావాలి.

దాంతో అప్పటిప్పుడు కొంతమంది కుర్రాళ్లు, బైక్ లు వున్న వాళ్లు రయ్ మని వెళ్లారు. పవన్ ను అభినందిస్తున్నట్లు ఫొటోలు దిగారు. వచ్చారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం. ఆ విధంగా బ్రాహ్మణ ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం. ఎన్నికల్లో ఎన్ని టెక్నిక్ లో ఇలా.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?