ఫేవరెట్ హీరో విషయంలో అభిమానులు క్లియర్ కట్ గా ఉంటారు. తమకు ఫలనా హీరో అంటే ఇష్టం అని పబ్లిక్ గా చెబుతుంటారు. హీరోయిన్లు మాత్రం ఈ విషయంలో పెద్దగా బయటపడరు. ఎందుకంటే అవకాశాలు పోతాయని భయం. ఏ హీరోను పొగిడితే ఏ హీరో హర్ట్ అవుతాడో తెలియని భయం. అందుకే అందరూ ఇష్టమే, అందరితో సినిమాలు చేయాలని ఉందంటూ కలరింగ్ ఇస్తుంటారు. కానీ పాయల్ రాజ్ పుత్ మాత్రం ఈ విషయంలో చాలా స్ట్రయిట్ గా ఉంది.
వెండితెరపై బోల్డ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పడంలో కూడా అంతే బోల్డ్ గా రియాక్ట్ అయింది. విజయ్ దేవరకొండ కంటే తనకు ప్రభాస్ అంటేనే ఇష్టమని ప్రకటించింది. అక్కడితో ఆగకుండా.. ఒకేసారి ఇటు దేవరకొండ, అటు ప్రభాస్ సినిమాల్లో నటించే ఛాన్స్ వస్తే.. ఎవర్ని సెలక్ట్ చేసుకుంటావనే ప్రశ్నకు.. తడుముకోకుండా ప్రభాస్ అని సమాధానం చెప్పేసింది.
నిజానికి కాల్షీట్లు ఎడ్జెస్ట్ చేసుకుంటానని, ఇద్దరితో నటిస్తానని చెబితే సరిపోయేది. కానీ పాయల్ మాత్రం ప్రభాస్ కోసం వెయిటింగ్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. ప్రభాస్ నుంచి ఆఫర్ వస్తే, పక్కన ఎంత పెద్ద సినిమా ఉన్నా వదిలేస్తానని ప్రకటించింది. ఈ ఒక్క విషయంలో విజయ్ దేవరకొండను కూడా పక్కనపెట్టేస్తానంటోంది.
రీసెంట్ గా వెంకీమామ సినిమా చేసింది పాయల్. కానీ అది ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. అంతకంటే ముందు ఆమె చేసిన ఆర్డీఎక్స్ లవ్ అనే సినిమా ఆమె కెరీర్ ను బాగా దెబ్బతీసింది. ప్రస్తుతం పాయల్ చేతిలో రవితేజ హీరోగా డిస్కోరాజా మూవీ మాత్రమే ఉంది.