పెద్ద సినిమాలు చేస్తున్న తప్పు

పెద్ద సినిమాలు పెద్ద తప్పు చేస్తున్నాయి. తాము ఎప్పుడు వచ్చినా, అక్కడున్న చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తప్పుకుంటాయి అనే ధీమాతో వ్యవహరిస్తున్నాయి. దీంతో చాలా కీలకమైన కొన్ని తేదీలు సరైన సినిమా లేకుండా…

పెద్ద సినిమాలు పెద్ద తప్పు చేస్తున్నాయి. తాము ఎప్పుడు వచ్చినా, అక్కడున్న చిన్న, మిడ్ రేంజ్ సినిమాలు తప్పుకుంటాయి అనే ధీమాతో వ్యవహరిస్తున్నాయి. దీంతో చాలా కీలకమైన కొన్ని తేదీలు సరైన సినిమా లేకుండా వృధాగా పోతున్నాయి. ఆదికి ముందే సరైన సెలవులు, లాంగ్ వీకెండ్ లు చూసి డేట్ అనౌన్స్ చేసేస్తున్నారు. తీరా చేసి దగ్గరకు వచ్చినా సినిమా రెడీ కాదు. అలా అని ముందుగా రావడం లేదని చెప్పరు. గ్యాసిప్ లు వచ్చినా అవును అనరు, కాదనరు. దాంతో మీడియం రేంజ్ సినిమాలు అయోమయంలో పడుతున్నాయి.

సినిమా రెడీ చేసి వుంచుదాం అంటే అలా చేయడం వల్ల ఆర్ధికంగా చాలా ఇబ్బందులు వుంటాయి. అందరూ వాటిని భరించలేదు. పైగా డేట్ వేసుకున్న పెద్ద సినిమాలు సరిగ్గా వారం ముందో, అప్పటి కప్పుడో సారీ..రావడం లేదు అని చెప్పి ఊరుకుంటాయి. రెడీగా వున్నా కూడా పబ్లిసిటీకి టైమ్ సరిపోదు. ఈ మధ్య చాలా మంచి తేదీలు ఇలా వేస్ట్ అయిన సందర్భాలు వున్నాయి.

ఈ ఆగస్ట్ 15 కూడా అలాగే అయ్యేలా వుంది. పుష్ప 2 వస్తుందా లేదా అన్న క్లారిటీ లేదు. రాదనే గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. యూనిట్ వైపు నుంచి ఖండించడం లేదు. దాంతో వేరెవరు ఆ టైమ్ కు రావాలా? వద్దా? అన్నది డిసైడ్ చేసకోలేకపోతున్నారు. డబుల్ ఇస్మార్ట్ ధైర్యం చేసి డేట్ వేసారు. పుష్ప 2 రాదని ముందుగా తెలిసి వుంటే నాని.. సరిపోదా శనివారం కాస్త స్పీడప్ చేసి రెడీ చేసేవారు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది.

కనీసం గిల్డ్ కు అయినా డేట్ ల విషయంలో సరైన సమాచారం ఇస్తే, టాలీవుడ్ లో సరైన తేదీలు వృధా కాకుండా వుంటాయి.