Advertisement

Advertisement


Home > Movies - Movie News

సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు.. దొరకని ఆచూకీ

సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు.. దొరకని ఆచూకీ

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు థ్రెట్ ఉందనే విషయం అందరికీ తెలుసు. ఈ క్రమంలో ఈరోజు ఉదయం అతడి ఇంటిపై కాల్పులు జరిపారు ఇద్దరు అగంతకులు. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ దాడికి సంబంధించి ఇప్పటివరకు బండి నంబర్ కూడా పట్టుకోలేకపోయారు పోలీసులు.

ఇంతకీ ఏం జరిగింది.. ఉదయం 5 గంటలు.. ముంబయి బాంద్రా నిర్మానుష్యంగా ఉంది. అప్పుడే బైక్ పై ఇద్దరు దుండగులు బాంద్రాలో అడుగుపెట్టారు. నేరుగా సల్మాన్ ఇల్లు గెలాక్సీ వైపు దూసుకెళ్లారు. బైక్ వెనక కూర్చున్న వ్యక్తి గన్ తీశాడు. ఒకసారి, రెండు సార్లు కాదు.. ఏకంగా 4-5 రౌండ్లు కాల్పులు జరిపాడు. కొన్ని రౌండ్లు గాల్లో కాల్పులు జరిపిన అగంతకుడు, సల్మాన్ ఇంటి వైపు కూడా షూట్ చేశాడు.

వెంటనే రంగంలోకి దిగిన ముంబయి పోలీసులు, ఎప్పట్లానే సీసీటీవీ ఫూటేజ్ ఆధారంగా దర్యాప్లు మొదలుపెట్టారు. అయితే దారుణమైన విషయం ఏంటంటే.. ప్రముఖులు నివసించే బాంద్రా లాంటి ప్రాంతంలో కూడా నాసిరకం సీసీటీవీ కెమెరాలున్నాయి.

వ్యక్తులు హెల్మెట్లు ధరించడంతో వాళ్లను ఎలాగూ గుర్తుపట్టలేకపోయారు. కనీసం బైక్ నంబర్ కూడా కనిపించలేదంటే, సీసీ కెమెరాల నాణ్యతను అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు ఫోరెన్సిక్ టీమ్ తో నమూనాలు సేకరిస్తున్న పోలీసులు, మరోవైపు సీసీటీవీ ఫూటేజ్ నాణ్యతం పెంచడం కోసం టెక్నికల్ టీమ్ ను ఆశ్రయించారు.

సల్మాన్ కు బెదిరింపులు కొత్తకాదు.. సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు కొత్తకాదు. గతంలో అతడికి కొన్ని బెదిరింపులు వచ్చాయి. ఆమధ్య అతడికి ఓ ఈ-మెయిల్ కూడా వచ్చింది. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి సల్మాన్ కు వై-ప్లస్ భద్రతను పెంచారు. ఈమధ్య సల్మాన్ తుపాకీ లైసెన్స్ కూడా పొందాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి బుల్లెట్ ప్రూవ్ కారు కూడా కొనుక్కున్నాడు.

ఓవైపు ఇన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ సల్మాన్ కు బెదిరింపులు మాత్రం ఆగలేదు. తాజాగా జరిగిన కాల్పుల ఘటన కూడా బెదిరింపుల్లో భాగంగానే జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో ఇంట్లో సల్మాన్ ఉన్నాడా లేదా అనే విషయాన్ని పోలీసులు వెల్లడించలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?