పొలిమేర దాటిన హర్రర్..థ్రిల్లర్

ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లో విడుదలైన హర్రర్ థ్రిల్లర్.. పొలిమేర. ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు సీక్వెల్ గా పొలిమేర 2 విడుదల చేస్తున్నారు. ఆల్ మోస్ట్ సేమ్ కాస్ట్…

ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ లో విడుదలైన హర్రర్ థ్రిల్లర్.. పొలిమేర. ఈ సినిమాకు మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు సీక్వెల్ గా పొలిమేర 2 విడుదల చేస్తున్నారు. ఆల్ మోస్ట్ సేమ్ కాస్ట్ అండ్ క్రూ. సినిమా కంప్లీట్ కావడంతో ట్రయిలర్ విడుదల చేసారు. అంతకు ముందే సినిమా చూసి గీతా బన్నీ వాస్ మిత్రుడు వంశీ నందిపాటి హోల్ సేల్ గా కొనుగోలు చేసి, విడుదల చేస్తున్నారు.ఈ సినిమా ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు.

బన్నీవాస్, నందిపాటి వంశీ, దర్శకుడు విశ్వనాధ్, నటులు సత్యం రాజేష్, గెటప్ శ్రీను, హీరోయిన్ మీనాక్షి తదితరులు ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.

ట్రయిలర్ అవుట్ అండ్ అవుట్ హర్రర్ థ్రిల్లర్ గానే సాగింది. ఇలాంటి సినిమాలకు కథ ఇంపార్టెంట్ కాదు. కథనమే. ట్రయిలర్ కూడా అదే విషయం మీద దృష్టి పెట్టింది. కేవలం హర్రర్ కాకుండా, చేతబడులు, సస్పెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసారు. మేకర్లు చెబుతున్నట్లుగానే ట్రయిలర్ లో అతీంద్రయ శక్తులు, చెడుపులు, చేతబడులు, బలులు, తో పాటు వెల్లడించని సస్పెన్స్ మీద ఎక్కువగా కట్ చేసారు.

నటులు ఎవరు అన్నది పెద్దగా పట్టదు. కంటెంట్ ఇంట్రస్టింగ్ గా వుంది కనుక ట్రయిలర్ బాగానే ఆక్టట్టుకుంటుంది. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది.ఈ సినిమా నవంబర్ 2న థియేటర్లలోకి వస్తోంది.