పూజ…మ్యాంగో గిఫ్ట్ ప్యాక్ లు

ఇండస్ట్రీ జనాలతో మంచి రిలేషన్లు మెయింటెయిన్ చేయడంలో హీరోయిన్ పూజా హెగ్డే ముందు వుంటుంది. పారితోషికం లేదా కాల్ షీట్ల విషయంలో అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తుంది.  Advertisement ఇంతకీ…

ఇండస్ట్రీ జనాలతో మంచి రిలేషన్లు మెయింటెయిన్ చేయడంలో హీరోయిన్ పూజా హెగ్డే ముందు వుంటుంది. పారితోషికం లేదా కాల్ షీట్ల విషయంలో అస్సలు ఇబ్బంది పెట్టదు. ఏదో విధంగా అడ్జస్ట్ చేస్తుంది. 

ఇంతకీ ఇప్పటి విషయానికి వస్తే పూజా హెగ్డేకు మాంగళూరు దగ్గర మ్యాంగో ఫార్మ్ వుంది. ఈ సారి మాంచి దిగుబడి వచ్చింది. అందుకే టాలీవుడ్ లోని పలువురికి మామిడిపళ్ల గిఫ్ట్ హ్యాంపర్లు తన మేనేజర్ హరి ద్వారా పంపిణీ ప్రారంభించింది. 

తొలి రోజు ఒకరిద్దరు నిర్మాతలకు, దర్శకులకు అందాయి. రేపటి నుంచి వరుసగా చాలా మందికి అందచేయడానికి ఏర్పాట్లు చేసారు. ముందుగా అందుకున్నవారిలో దర్శకుడు త్రివిక్రమ్ వున్నారు. 

ఇంకా అందాల్సిన వారు చాలా మందే వున్నారు. హరీష్ శంకర్, మైత్రీ, యువి, గీతా, ఇంకా పలువురు హీరోలు, దర్శకులు జాబితాలో వున్నారని తెలుస్తోంది.