పోసాని టాపిక్ లేకుండానే

పవన్ కళ్యాణ్ ను మంచి చేసుకోవాలని, ఆయన ప్రాపకం పోకుండా వుండాలని టాలీవుడ్ నిర్మాతలు కొందరు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది.  Advertisement నిన్నటికి నిన్న వెళ్లి పవన్ కు తాము మంత్రితో జరిపిన చర్చల సారాంశం…

పవన్ కళ్యాణ్ ను మంచి చేసుకోవాలని, ఆయన ప్రాపకం పోకుండా వుండాలని టాలీవుడ్ నిర్మాతలు కొందరు తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. 

నిన్నటికి నిన్న వెళ్లి పవన్ కు తాము మంత్రితో జరిపిన చర్చల సారాంశం వివరించారు. అంతకన్నా పెద్దగా జరిగింది ఏమీ లేదు. కానీ బయట మాత్రం ఓ రేంజ్ లో ఫీలర్లు వదిలారు.

మంత్రి నాని నే స్వయంగా తమను పవన్ ను కలిసి వివరించమని కోరారనే ఫీలర్ బయటకు వదిలారు. వాళ్లు డబుల్ గేమ్ ఆడుతున్నారు అనే మాట రాకుండా కావచ్చు. అలాగే పోసాని పై టాలీవుడ్ చర్య తీసుకుంటుంది అని పవన్ కు చెప్పారని, దానికి ఆయన పెద్ద మనసుతో వద్దని వారించారనే ఫీలర్ ఇంకోటి.

విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం అసలు పోసాని టాపిక్ నే పవన్ దగ్గర రాలేదు. కేవలం మంత్రి దగ్గర చర్చల సారాశం మాత్రమే చెప్పారు. ఆయన కూడా ఓకె మీ ప్రయత్నాలు మీరు చేయండి..నేనేం డిస్ట్రబ్ చేయననే రీతిలో సమాధానం ఇచ్చారని తెలుస్తోంది.

కానీ దీనికి చిలవలు, పలవలు అల్లి, పవన్ కు ఓ రేంజ్ లో ప్రాముఖ్యత వుండేలా ఫీలర్లు వదిలారు. దీంతో మంత్రి పేర్ని నాని దగ్గర సమస్య ఏమీ లేదు.

ఎందుకంటే పేర్ని నాని ఇండస్ట్రీతో చాలా సాన్నిహిత్యంగా వుంటున్నారు. అందువల్ల ఆయనేమీ అనుకోరు. కానీ ఈ ఫీలర్లు అలా అలా పెద్దవై సిఎమ్ జగన్ దృష్టికి వెళ్తే ఎలా వుంటుందన్నదే చూడాలి.