మారుతి-ప్రభాస్ సినిమా మీద ఎన్ని గ్యాసిప్ లు వున్నా, తెరవెనుక దాని పనులు దానికి జరుగుతూనే వున్నాయి. పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించే ఈ సినిమా లోని ఓ ప్రధాన పాత్రకు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ను తీసుకునే ఆలోచనలు సాగుతున్నాయి. ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కానీ ఈ దిశగా ప్రయత్నాలు అయితే మొదలయ్యాయి.
కేజిఎఫ్ 2 సినిమాలో సంజయ్ దత్ నటించిన సంగతి తెలిసిందే. ప్రభాస్-మారుతి సినిమాలో సంజయ్ దత్ ను తీసుకుంటే పాన్ ఇండియా లుక్ బాగా వస్తుంది. ఇప్పటికే తమిళ హీరోయిన్ ను ఫైనల్ చేసారు. ఇప్పుడు హిందీ స్టార్ ను ప్లాన్ చేస్తున్నారు. మారుతి సినిమాలో కనిపించే రొటీన్ బ్యాచ్ అంటూ ఒకటి వుంటుంది. మారుతి ఏ సినిమా చేసినా వీళ్లు రెడీగా వుంటారు.
కానీ ఈసారి మాత్రం మారుతి బుద్దిగా వీళ్లందరినీ పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా తన సినిమాకు కొత్త లుక్ ఇవ్వాలని, గ్రాండ్ లుక్ వుండాలని అనుకుంటున్నారు. అందుకే స్టార్ కాస్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా వుంటున్నారు. ముఖ్యంగా ఈ రొటీన్ బ్యాచ్ ను పక్కన పెట్టడం అన్నది కీలక నిర్ణయం. దాని వల్ల సినిమాకు చీప్ లుక్ వస్తోందని మారుతికి సత్యం బోధపడింది.
సంజయ్ దత్ ను తీసుకోవడం తో పాటు మలయాళ, కన్నడ రంగాలకు చెందిన నటులు కొందరి పేర్లు కూడా పరిశీలిస్తున్నారు. రొటీన్ బ్యాచ్ ను పక్కన పెట్టాలని అనుకోవడంతోనే మారుతికి ‘మంచి రోజులు వచ్చాయి’ ఏమో?